మహేష్ బాబు నిర్మాతగా విజయ్ దేవరకొండ, సందీప్ వంగా సినిమా..

సూపర్ స్టార్.. మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..వ్యాపారంలో అడుగులు వేస్తున్నారు.

news18-telugu
Updated: May 9, 2019, 11:25 AM IST
మహేష్ బాబు నిర్మాతగా విజయ్ దేవరకొండ, సందీప్ వంగా సినిమా..
మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ, మహేష్ బాబు
  • Share this:
సూపర్ స్టార్.. మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..వ్యాపారంలో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఈ మద్యే AMB Cinemas అనే ఓ మల్టీప్లెక్స్‌‌ను ప్రారంభించారు. అంతేకాకుండా తన సొంత బ్యానర్‌పై కొన్ని సినిమాలకు భాగస్వామిగా కూడా వ్యవరిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన 'శ్రీమంతుడు', 'బ్రహ్మోత్సవం' లాంటీ  సినిమాలకు సహా నిర్మాతగా ఉన్నారు.  దీనికి తోడుగా సొంతంగా ఆయన 'మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్‌'పై త్వరలో సినిమాలను నిర్మించబోతున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే సినిమాను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీనికి తోడుగా మహేష్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టును ఓకే చేశాడని తెలుస్తోంది.  విజయ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకునిగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' సూపర్ బ్లాక్ బస్టర్ అయిన తరువాత, దర్శకుడు సందీప్ వంగా మహేష్ వద్దకు వచ్చి ఓ ఆసక్తికరమైన కథను వినిపించాడు. ఈ కథను మహేష్ కూడా నచ్చడంతో త్వరలోనే వీరీద్దరు కలిసి ఓ సినిమా చేయనున్నారని ..టాక్ కూడా వినిపించింది. కానీ ఎందుకో.. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.

మహేష్, సందీప్, విజయ్
మహేష్, సందీప్, విజయ్


అయితే.. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను స్వయంగా మహేష్ బాబు తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఈ మద్య ఓ సమావేశంలో.. మహేష్ మాట్లాడుతూ.. మంచి కథ, టాలెంట్ ఉన్నవారిని  తాను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తానని..చెబుతూ  ఒకవేళ తను హీరోగా నటించలేకపోయినా వేరే హీరోతో నైనా సినిమా తీసి..నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడానికి  సిద్ధంగా ఉన్నానని మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ 'మహర్షి' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
First published: May 9, 2019, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading