హోమ్ /వార్తలు /సినిమా /

కుండీని తన్నినట్టు రికార్డులు తన్నేయాలి.. మహర్షి మూవీపై వెంకటేష్

కుండీని తన్నినట్టు రికార్డులు తన్నేయాలి.. మహర్షి మూవీపై వెంకటేష్

మహేష్ బాబు, వెంకటేష్

మహేష్ బాబు, వెంకటేష్

సీతమ్మ వాకిట్లో సినిమాలో చిన్నోడుగా నటించిన మహేష్ బాబు కుండీని తన్నినట్టు.. మహర్షి సినిమాతో రికార్డులు అన్నీ తన్నేయాలని విక్టరీ వెంకటేష్ ఆకాంక్షించాడు.

    సీతమ్మ వాకిట్లో సినిమాలో చిన్నోడుగా నటించిన మహేష్ బాబు కుండీని తన్నినట్టు.. మహర్షి సినిమాతో రికార్డులు అన్నీ తన్నేయాలని విక్టరీ వెంకటేష్ ఆకాంక్షించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా మహర్షి ప్రీ రిలీజ్ వేడుకకు వెంకటేష్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు చిన్నోడు కుండీని తన్నాడు. ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ కుండీని తన్నినట్టు రికార్డులన్నీ తన్నేయాలి.’ అని ఆకాంక్షించాడు. దీంతో ఆడియో ఫంక్షన్‌లో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు మహేష్ బాబు. ఇండస్ట్రీలో ఏ హీరో అంటే అంతగా ఇష్టం ఉండదని.. వెంకటేష్ అంటే మాత్రం చాలా ఇష్టమని చెప్పాడు.

    First published:

    Tags: #Maheshbabu25, Maharshi, Tollywood Movie News, Venkatesh

    ఉత్తమ కథలు