మహేశ్ బాబు మహర్షి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఊపిరి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని వంశీ చేసిన సినిమా ఇది. పైగా ఇది మహేశ్ బాబుకు 25వ సినిమా కావడంతో అభిమానులు కూడా మహర్షి సినిమాపై ఆకాశమంత అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిజం చేయడానికి మహేశ్ బాబు కూడా చాలా కష్టపడుతున్నాడు.
ఈ చిత్రంతో కచ్చితంగా తాను బ్లాక్ బస్టర్ అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే మహర్షి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. విడుదలకు ఆరు రోజుల ముందే సెన్సార్ పూర్తి చేసుకుని.. అన్ని అడ్డంకులు దాటేసాడు రిషి. దీనికి ఒక్క కట్ కూడా లేకుండా యు బై ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమాను దిల్ రాజు, పివిపి, అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మించారు. దాదాపు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది ఈ చిత్రం.
సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు పూజా హెగ్డే గ్లామర్ షో కూడా ఉండటంతో యుకు తోడుగా ఏ కూడా ఇచ్చింది సెన్సార్ బోర్డ్. టాక్ కూడా బాగానే రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం కచ్చితంగా సంచలన విజయం సాధించి.. మహేశ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. మరి వాళ్ల నమ్మకాన్ని వంశీ పైడిపల్లి.. మహేశ్ బాబు ఎంతవరకు నిలబెడతారో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashwini Dutt, Dil raju, Mahesh babu, Pooja Hegde, PVP, Telugu Cinema, Tollywood, Vamsi paidipally