మహానటి ’15 రోజుల’ కలెక్షన్స్

Sunil Kumar Jammula | news18
Updated: May 25, 2018, 6:08 AM IST
మహానటి ’15 రోజుల’  కలెక్షన్స్
కీర్తిసురేష్ ఫైల్ ఫోటో
  • News18
  • Last Updated: May 25, 2018, 6:08 AM IST
  • Share this:
ప్రముఖ  నటి  సావిత్రి  జీవితం ఆధారం గా  తెరకెక్కిన మహానటి  మూవీ  రిలీజ్ అయ్యి రెండు వారలు  గడిచినప్పటికీ  మంచి కలెక్షన్స్ రాబడుతూనే  ఉంది . ఇక తెలుగు సినిమాకు  కలక్షన్స్ కి  మెయిన్ ఏరియా అయినటువంటి  నైజాం ఏరియాలో ఈ సినిమా భారీ కలెక్షన్స్  రాబడుతుంది . రిలీజ్ అయ్యి  15 రోజులు అయ్యినప్పటికీ  నైజాం ఏరియాలో కలెక్షన్స్ ఏ మాత్రం డ్రాప్ అవ్వలేదు. 15 రోజు నైజాం లో  26 లక్షలు వసూలు చేసింది.  ఇక ఓవరాల్  గా నైజాం లో 9 కోట్లు వసూలు చేసింది .

మహానటి ఓవర్‌ సీస్‌లో ఇప్పటి వరకు రెండు మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది.  ఓవరాల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 30 కోట్లు పైన వసూలు  చేసింది. 11 కోట్లు తెరెకెక్కిన  ఈ సినిమా  ఇప్పటికీ  తెలుగు  రాష్టాల్లో  హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో కనిపించగా.. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, క్రిష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ నిర్మాణంలో స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు.

 

 

 
Published by: Sunil Kumar Jammula
First published: May 25, 2018, 6:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading