MAHANATI FAME KEERTHY SURESH GOOD LUCK SAKHI TRAILER GETS GOOD RESPONSE ON YOUTUBE SR
Keerthy Suresh | Good Luck Sakhi : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి ట్రైలర్..
‘గుడ్ లక్ సఖి’లో కీర్తి సురేష్ (Twitter/Photo)
Keerthy Suresh - Good Luck Sakhi Trailer Talk : కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. అది అలా ఉంటే ఇటీవల కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా ట్రైలర్‌ను విడుదల విడుదల చేసారు.
Keerthy Suresh : కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్‌బాబుకు జోడిగా (Sarkaru Vaari Paata) సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నాని హీరోగా వస్తున్న దసరాలోను నటిస్తున్నారు. అది అలా ఉంటే కీర్తి నటిస్తున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం (Good Luck Sakhi) గుడ్ లక్ సఖి.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కకునూర్ డైరెక్ట్ చేసారు. షూటింగ్ పూర్తి చేసుకున్న.. ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా మొన్నటి వరకు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాను మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 28 న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఇప్పటికే 5 మిలియన్స్‌పైగా వ్యూస్‌తో దూసుకు పోతుంది.
ట్రైలర్ విషయానికొస్తే.. ఎక్కడో మారుమూల గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్‌గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. తాను పెరిగిన ఊర్లో కీర్తి సురేష్ అందరికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతోదనేది వారి నమ్మకం. ఆడవాళ్లకు షూటింగ్ ఎంటని ఎగతాళి చేస్తుంటారు. మరి అందరిచే ‘బ్యాడ్ లక్ సఖి’ అనిపించుకున్న కీర్తి సురేష్ అందరిచే ‘గుడ్ లక్ సఖి’ అనిపించుకుందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఇక ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు U సర్టిఫికేట్ జారీ చేసారు. ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు.
ఇక కీర్తి సురేష్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే... మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌కు జోడిగా నాగ శౌర్య నటిస్తున్నట్టు సమాచారం.
ఈ రెండు సినిమాలతో పాటు కీర్తి తెలుగులో మరో సినిమాలోను నటిస్తున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న దసరా చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు.వీటితో పాటు కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.
హిందీ మిమీలో కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషల్లో ఎలా ఆకట్టుకోనుందో..
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.