మహానటి కీర్తి సురేష్‌కు మిస్ ఇండియా కిరీటం

కీర్తి సురేష్ నటిస్తున్న కొత్త చిత్రం 'మిస్ ఇండియా'. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ రివీల్ టీజర్‌ను మూవీ యూనిట్ సోమవారం విడుదల చేసింది. ఇందులో స్లిమ్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది కీర్తి సురేష్.

news18-telugu
Updated: August 26, 2019, 5:43 PM IST
మహానటి కీర్తి సురేష్‌కు మిస్ ఇండియా కిరీటం
మిస్ ఇండియా (నెట్ ఫ్లిక్స్): నవంబర్ 4
  • Share this:
తెలుగు సినిమా కీర్తిని దేశానికి మరోసారి చాటిచెప్పిన 'మహానటి' కీర్తి సురేష్. సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటిలో లీడ్ రోల్ పోషించిన కీర్తి..అద్భుత నటనతో అందరి మనన్నలు పొందింది. సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశంచేసి ఏకంగా మహానటి బిరుదును సొంతం చేసుకుంది. సావిత్రిగా మెప్పించిన కీర్తి సురేష్.. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మహానటి తర్వాత తెలుగులో మన్మథుడు-2 సినిమాలో మాత్రమే కీర్తి సురేష్ నటించింది. ఐతే అందులో గెస్ట్ రోల్‌కే ఆమె పరిమితమైంది. మరి కీర్తి సురేష్ టైటిల్ రోల‌్‌లో నటిస్తున్న సినిమా ఏంటో తెలిసిపోయింది. మొన్నటి వరకు మహానటిగా మెప్పించిన కీర్తి..త్వరలో మిస్ ఇండియా మన ముందుకు రాబోతోంది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'మిస్ ఇండియా'.  ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ రివీల్ టీజర్‌ను మూవీ యూనిట్ సోమవారం విడుదల చేసింది. ఇందులో స్లిమ్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది కీర్తి సురేష్.

మిస్ ఇండియా సినిమాకు నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, సుమంత్‌, నదియా ఇందులో నటిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మిస్ ఇండియా టైటిల్ రివీల్ టీజర్:
Published by: Shiva Kumar Addula
First published: August 26, 2019, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading