Keerthy Suresh : అలాంటి సినిమాల్లో నటించను.. అదే చివరి సినిమా : కీర్తి సురేష్

Keerthy Suresh :'మహానటి’ చిత్రం హీరోయిన్ కీర్తి సురేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర పురస్కాలను ఇటీవల ప్రకటించగా.. ‘మహానటి’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎంపికైంది కీర్తి సురేష్. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి.. ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

news18-telugu
Updated: August 16, 2019, 10:44 AM IST
Keerthy Suresh : అలాంటి సినిమాల్లో నటించను.. అదే చివరి సినిమా : కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఫోటో Instagram.com/keerthysureshofficial
news18-telugu
Updated: August 16, 2019, 10:44 AM IST
Keerthy Suresh :'మహానటి’ చిత్రం హీరోయిన్ కీర్తి సురేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర పురస్కాలను ఇటీవల ప్రకటించగా.. ‘మహానటి’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎంపికైంది కీర్తి సురేష్. ప్రస్తుతం మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో చిత్రాల్లో నటిస్తోన్న కీర్తీసురేశ్‌ త్వరలో తమిళంలోనూ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. నేషనల్ అవార్డ్ పొందిన సందర్బంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తాను తీసుకున్న ఓ సంచలన నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ మరోసారి బయోపిక్‌ చిత్రాల్లో నటించేది లేదని చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. సావిత్రి బయోపిక్‌నే తాను నటించిన తొలి, చివరి చిత్రం అవుతుందని తెల్చేసింది.



 






View this post on Instagram




 

Missing the #Malaga Sun!🌞#throwbacksunday #spaindiaries ❤️


A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on





'మహానటి'లో సావిత్రి పాత్రలో నటించాక మరొకరి జీవిత చరిత్రలో నటించడం కరెక్ట్ కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కీర్తి. మహానటి చిత్ర షూటింగ్‌ పూర్తి కాగానే ఏదో మనసును వదిలి వెళ్లిపోయిన ఫీలింగ్‌ కలిగిందని ఈ సందర్బంగా కీర్తి చెబుతూ... గుండె పగిలేలా ఏడ్చేశానని తెలిపింది. ఈ ఇంటర్వ్యూ లో తనకు ఇష్టమైన హీరో,హీరోయిన్ ల గురించి ప్రస్తావిస్తూ హిందీలో షారూఖ్‌ఖాన్, దీపికాపదుకోనే, అలియాభట్‌ చాలా ఇష్టం అని పేర్కొంది.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...