హోమ్ /వార్తలు /సినిమా /

Maha Samudram Twitter Review : మహా సముద్రం ట్విట్టర్ రివ్యూ.. శర్వానంద్, సిద్ధార్ధ్ తీరం దాటారా..

Maha Samudram Twitter Review : మహా సముద్రం ట్విట్టర్ రివ్యూ.. శర్వానంద్, సిద్ధార్ధ్ తీరం దాటారా..

మహా సముద్రం కలెక్షన్స్ (Maha Samudram Photo : Twitter)

మహా సముద్రం కలెక్షన్స్ (Maha Samudram Photo : Twitter)

Maha Samudram Twitter Review : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మహా సముద్రం’. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సామాజిక మాధ్యమాల్లో మంచి టాకే సొంతం చేసుకుంది. మొత్తంగా పబ్లిక్ ఓపినియన్ ఎలా ఉందంటే..

ఇంకా చదవండి ...

Maha Samudram Twitter Review : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మహా సముద్రం’  (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటించారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. పైగా ఆర్ఎక్స్ 100 తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి చేసిన సినిమా ఇది. ప్యూర్ ఇన్టెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కినట్టు కనిపిస్తోంది.  ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం మొత్తం ప్రేమకథనే ఉందంటున్నాడు అజయ్ భూపతి.

దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది తనకు రీ లాంఛ్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధూ మాటలు విన్న తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. అయితే అంచనాలు కూడా అలాగే పెంచేసాడు. తాజాగా ఈ రోజు విడుదలైన ఈ సినిమా పలు ప్రాంతాల్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..


 ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని.. కచ్చితంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బరువైన హృదయాలతో వస్తారని నమ్మకంగా చెప్పాడు సిద్ధార్థ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసింది. హిట్ అనిపించుకోవాలంటే .. రూ. 18 కోట్లకు పైగా రాబట్టాలి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..

ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టినట్టు చెబుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్ అని చెబుతున్నారు. కొంత మంది టాక్ బాగుంటే చూస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అటు క్లాస్ హీరోలుగా ముద్ర పడ్డ శర్వానంద్, సిద్ధార్ధ్ కలిసి మాస్ సినిమా చేయడంతో ఈ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా ఇంటెన్సివ్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

First published:

Tags: Ajay bhupathi, Anu emmanuel, Maha Samudram, Sharwanand, Siddharth, Tollywood

ఉత్తమ కథలు