Home /News /movies /

MAHA SAMUDRAM TRAILER TALK SHARWANAND SIDDHARTH AJAY BHUPATHI ACTION DRAMA TA

Maha Samudram Trailer Talk : శర్వానంద్, సిద్ధార్థ్‌ల మహా సముద్రం ట్రైలర్ టాక్.. యాక్షన్ అదిరిపోయిందిగా..

మహా సముద్రం ట్రైలర్ టాక్ (Twitter/Photo)

మహా సముద్రం ట్రైలర్ టాక్ (Twitter/Photo)

Maha Samudram Trailer Talk : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    Maha Samudram Trailer Talk : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’  (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటించారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ లుక్, టీజర్‌లతో మంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా నుంచి  ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ ప్రపంచవ్యాప్తంగావిడుదల  (Maha Samudram release for dussehra)  చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు.

    ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్‌లో సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ భూపతి.


    ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్నారు.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    మ‌హా స‌ముద్రం సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. కాగా ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

    అయితే ఇప్పటికే దసరా బరిలో బాలయ్య అఖండ బరిలో ఉందని సమాచారం అందుతోంది. కానీ అఖిల్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.  ఇక శర్వానంద్ విషయానికి వస్తే.. ఆయన ఇటీవల శ్రీకారం అనే సినిమాతో వచ్చాడు. సినిమా కథ, కథనం బాగున్నా... థియేటర్స్‌లో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajay bhupathi, Maha Samudram, Sharwanand, Siddharth, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు