Home /News /movies /

MAHA SAMUDRAM TRAILER SHARWANAND SIDDHARTH AJAY BHUPATHI ACTION DRAMA MAHA SAMUDRAM TRAILER GETS GOOD RESPONSE SR

Maha Samudram Trailer : మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా.. రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్న మహా సముద్రం ట్రైలర్..

Maha samudram trailer Photo : Twitter

Maha samudram trailer Photo : Twitter

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’ (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై యూట్యూబ్‌లో మూడు మిలియన్ వ్యూస్‌తో అదరగొడుతోంది.

ఇంకా చదవండి ...
    ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’  (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు. తెలుగు తెరపై ఎప్పుడూ చూడని భావోద్వేగాలతో మా ‘మహా సముద్రం’ తెరకెక్కిందని, నేను చేసిన ‘ఆర్‌.ఎక్స్‌.100’ గురించి దేశం మొత్తం తెలుసు. అంతకుమించి ఈ సినియా ఉండబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అను ఇమ్మానుయేల్‌, సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రాహకుడు రాజ్‌ తోట పాల్గొన్నారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే మహా సముద్రం ట్రైలర్ మూడు మిలియన్ పైగా వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది.

    ట్రైలర్‌లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ భూపతి.

    Sukumar : ఘనంగా సుకుమార్ సతీమణి బర్త్ డే వేడుకలు.. పిక్స్ వైరల్...

    ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన (Maha Samudram release for dussehra) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. అందులో భాగంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రదర్శక నిర్మాతలు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు.

    Love Story Twitter Review : లవ్‌స్టోరి ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

    ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


    మ‌హా స‌ముద్రం సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. కాగా ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఇప్పటికే దసరా బరిలో బాలయ్య అఖండ బరిలో ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా కూడా ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Hero siddarth, Maha Samudram, Sharwanand, Tollywood news

    తదుపరి వార్తలు