Maha Samudram 6 days WW Collections: ‘మహా సముద్రం’ 6 డేస్ కలెక్షన్స్.. మహా నష్టాలు తప్పలేదుగా..!

మహా సముద్రం కలెక్షన్స్ (Maha Samudram collections)

Maha Samudram 6 days WW Collections: ఆర్ఎక్స్ 100 (RX 100) తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి చేసిన సినిమా మహా సముద్రం (Maha Samudram). ప్యూర్ ఇన్టెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రం వస్తుందని చెప్పాడు అజయ్. కానీ సినిమాలో మాత్రం అది కనిపించలేదు. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

  • Share this:
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయిపోయింది. ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.  కానీ సినిమాలో మాత్రం అంత విషయం కనిపించకపోయేసరికి పెదవి విరిచారు ప్రేక్షకులు. ఆర్ఎక్స్ 100 తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి చేసిన సినిమా ఇది. ప్యూర్ ఇన్టెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రం వస్తుందని చెప్పాడు అజయ్. కానీ సినిమాలో మాత్రం అది కనిపించలేదు. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది తనకు రీ లాంఛ్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు ఈయన. కానీ సినిమా చూసిన తర్వాత సిద్ధూ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం ఎందుకు చేసాడంటూ ప్రశ్నించారు.

ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని.. కచ్చితంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బరువైన హృదయాలతో వస్తారని నమ్మకంగా చెప్పాడు సిద్ధార్థ్. కానీ ఆయన మాటలు నిజం కాలేదు. శర్వానంద్ కూడా ఈ చిత్రంపై నమ్మకంగా కనిపించినా వాళ్ల ప్లాన్ వర్కవుట్ కాలేదు. శర్వానంద్‌కు సరైన విజయం వచ్చి చాలా రోజులైపోయింది. ఇక సిద్ధూ సంగతి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మహా సముద్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అంటే 6 రోజుల వసూళ్లు వచ్చాయి. హిట్ కావాలంటే దాదాపు 18 కోట్లు వసూలు చేయాలి. మరి 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..

Most Eligible Bachelor 5 days WW Collections: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 5 డేస్ కలెక్షన్స్.. అయ్యగారు పెద్ద హిట్ కొట్టారండోయ్..!



నైజాం: 1.91 కోట్లు
సీడెడ్: 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.83 కోట్లు
ఈస్ట్: 0.43 కోట్లు
వెస్ట్: 0.32 కోట్లు
గుంటూరు: 0.57 కోట్లు
కృష్ణా: 0.38  కోట్లు
నెల్లూరు: 0.27 కోట్లు

ఏపీ + తెలంగాణ: 5.67 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.59 కోట్లు
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 6.45 కోట్లు షేర్

ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే మరో 10 కోట్లకు పైగానే వసూలు చేయాలి. కానీ సినిమాకు ఉన్న టాక్ చూసిన తర్వాత ఇక్కడ్నుంచి ముందుకు వెళ్ళడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చినా కూడా పెద్దగా మహా సముద్రం యూజ్ చేసుకోలేకపోయింది.

Pelli Sandadi 5 days WW Collections: ‘పెళ్లి సందD’ 5 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..?


మూడు షోలు అలాగే ఉన్నా.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుపుకోవచ్చు అంటూ అనుమతులు ఇచ్చారు జగన్. దాంతో బయ్యర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మహా సముద్రం సినిమాకు హెల్ప్ కాలేదు కానీ దీంతో పాటు విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, పెళ్లి సందD సినిమాలకు బాగా కలిసొచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published: