Kim Sharma : ఖడ్గం సినిమాలో మెరిసిన భామ కిమ్ శర్మ, సినిమాల్లో కన్నా యువరాజ్ సింగ్ మాజీ ప్రియురాలిగానే బాగా ఫేమస్ అయ్యింది. నలబై దాటిన చెక్కుచెదరని అందంతో ఇప్పటికి కూడా కుర్రహృదయాలను దోచుకుంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన అందాలతో అక్కడ కనువిందు చేస్తోంది. ఆమె (Kim Sharma) నటించిన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఖడ్గంలో మెరిసిన ఈ భామ ఆ తర్వాత 2009లో వచ్చిన మగధీరలో కనిపించింది. ఈ సినిమాలో కిమ్ ఓ ఐటెమ్ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన డాన్స్ చేసి తన అందాలతో కనుల విందు చేసింది. ఇక ఆ తర్వాత కిమ్ శర్మ అదే సంవత్సరం తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన అంజనేయులులో కూడా మెరిసింది. ఇక అది అలా ఉంటే తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణేతో కొన్నాళ్లు డేటింగ్ చేసి.. తాజాగా విడిపోయి వార్తల్లో నిలిచిన కిమ్.. ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. కిమ్ లేటెస్ట్గా భారతీయ టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తో (Leander Paes )డేటింగ్ చేస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
Kim and Paes Photo : Twitter
గోవాలో కిమ్ ఇంకా లియాండర్ పేస్ వేకేషన్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లియాండర్ పేస్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు.
ఇక కిమ్ శర్మ గతంలో యువరాజ్‌తో ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత విడిపోయారు. చూడాలి మరి వీరి బంధం ఎంత దూరం వెళ్తుందో..
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.