రజినీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టేసిన మద్రాస్ హైకోర్టు..

సూపర్ స్టార్ రజినీకాంత్‌.. రీసెంట్‌గా ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై చేసిన వ్యాఖ్యలను ద్రవిడ సంఘాలు తప్పుపట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆయన పై ద్రవిడ సంఘాలు

news18-telugu
Updated: January 24, 2020, 6:04 PM IST
రజినీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టేసిన మద్రాస్ హైకోర్టు..
రజినీకాంత్ (File photo of Rajinikanth. (Image: AP)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్‌.. రీసెంట్‌గా ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై చేసిన వ్యాఖ్యలను ద్రవిడ సంఘాలు తప్పుపట్టిన సంగతి తెలిసిందే కదా. ఆయనపై చేసిన వ్యాఖ్యలను గాను రజినీకాంత్ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలంటూ పెరియార్ అభిమానులు డిమాండ్ చేసారు. దీనిపై తలైవా మాట్లాడుతూ.. అప్పట్లో కొన్ని పేపర్లో వచ్చిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రస్తావించాను తప్ప.. నేనిమి తప్పు చేయలేదంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చారు. తాజాగా రజినీకాంత్ పై కేసు నమోదు చేయాలంటూ ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజినీకాంత్ పై కేసు నమోదు చేసారు.అంతేకాదు  కొంత మంది పెరియార్ అభిమానులు నల్ల దుస్తులు ధరించి రజినీకాంత్ ఇంటి ముందు ధర్నా చేసారు. పోలీసు కేసు తర్వాత సదరు ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు రజినీకాంత్  పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. దీనిపై మద్రాస్ హైకోర్టు మాట్లాడుతూ.. ముందుగా మీరు మేజిస్ట్రేట్ కోర్టు వెళ్లండి.. ముందే తొందరపడి హైకోర్డుకు రావడం ఏంటి అంటూ ప్రశ్నిస్తూ.. రజినీకాంత్ పై వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు