రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ కొత్త చిక్కులు..సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్డు స్టే..

Darbar | సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దర్బార్’. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ చిత్ర విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 8, 2020, 8:29 AM IST
రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ  కొత్త చిక్కులు..సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్డు స్టే..
రజినీకాంత్ (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దర్బార్’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం భారీ ఎత్తున తెరకెక్కించింది. ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో ‘దర్బార్’ విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ పాత్రలో నటించాడు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. ఐతే.. ఈ సినిమా  రిలీజ్‌కు మద్రాస్ హైకోర్టు స్టే విధించింది మన దగ్గర కాదు.. మలేషియా దేశంలో. ఆ దేశానికి చెందిన డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్ద ‘దర్బార్’ సినిమా విడుదలను ఆపు చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తమ సంస్థకు లైకా ప్రొడక్షన్స్ రూ.23 కోట్లు బాకీ ఉన్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ‘రోబో’, ఆ తర్వాత ‘2.O’ తాజాగా ‘దర్బార్’ చిత్రానికి ఫైనాన్స్ ఇచ్చినట్టు పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు ‘దర్బార్’ సినిమా విడుదల కావాలంటే డీఎమ్‌వై క్రియేషన్స్ సంస్థకు లైకా ప్రొడక్షన్స్ రూ. 4.90 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
Published by: Kiran Kumar Thanjavur
First published: January 8, 2020, 8:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading