హోమ్ /వార్తలు /సినిమా /

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్..

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్..

విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్ (Twitter/Photo)

విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్ (Twitter/Photo)

Vishl Madras High Court | తమిళ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

Vishl Madras High Court | తమిళ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాల్.. గతేడాది తమన్నాతో కలిసి ‘యాక్షన్’ టైటిల్‌తో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. సి.సుందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. ముందుగా దర్శకుడు సుందర్, విశాల్.. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నాని మాట ఇచ్చారు. తీరా సెట్స్ పైకి వెళ్లేసరికి  బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత బడ్జెట్ వెనక్కి తిరిగి రాకపోతే..  ఆ నష్టాన్ని తానే భరిస్తానని నిర్మాతలకు హామి పత్రం కూడా ఇచ్చాడట విశాల్. మొత్తంగా ప్రచార ఖర్చులు అవి అన్ని కలిపి ఈ సినిమాకు రూ. 44 కోట్లు ఖర్చు అయిందట.

విశాల్ (Hero Vishal)
విశాల్ (Hero Vishal)

తీరా ‘యాక్షన్’ సినిమా విడుదలైన బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. దీంతో నిర్మాతలు ఈ సినిమాకు వచ్చిన లాస్ గురించి విశాల్ దగ్గర ప్రస్తావించారు. అయితే.. విశాల్ మాత్రం ఆ నిర్మాతల బ్యానర్‌ ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లో  చేస్తానని మాట ఇచ్చాడు. తీరా విశాల్ తాను నటిస్తోన్న కొత్త చిత్రాన్ని ట్రైడెంట్ బ్యానర్‌లో కాకుండా..  తన ఓన్ ప్రొడక్షన్ హౌస్‌లో చేయడంతో నిర్మాతలు ఈ విషయమై విశాల్‌ను నిలదీసారు. ఇక  విశాల్.. సినిమా నిర్మాణ విషయమై సెలెంట్‌గా ఉండటంగతో   ‘యాక్షన్’ చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.  దీంతో కోర్టు విచారణ జరిపి.. యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు విశాల్ నష్టపరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది. అంతేకాదు యాక్షన్ సినిమా నిర్మాతలకు రూ. 8.29 కోట్ల నష్టాన్ని భర్తీ చేసేలా వెంటనే  విశాల్ బ్యాండ్ గ్యారంటీ ఇవ్వాలని తన తీర్పులో పేర్కొనడం విశేషం.

First published:

Tags: Kollywood, Madras high court, Tollywood, Vishal

ఉత్తమ కథలు