హోమ్ /వార్తలు /సినిమా /

హీరో విశాల్ కొత్త సినిమాకు కష్టాలు.. మద్రాస్ హైకోర్టు నోటీసులు

హీరో విశాల్ కొత్త సినిమాకు కష్టాలు.. మద్రాస్ హైకోర్టు నోటీసులు

తన టైటిల్ అక్రమంగా దొంగిలించాడంటూ ఆయనపై కామెంట్ చేసాడు. ఆయన పేరు విజయ్ ఆనంద్.. 15 ఏళ్ళకు పైగానే ఈయన ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్నుంచి చాలా సినిమాలకు విశాల్‌తో కలిసి పని చేసాడు.

తన టైటిల్ అక్రమంగా దొంగిలించాడంటూ ఆయనపై కామెంట్ చేసాడు. ఆయన పేరు విజయ్ ఆనంద్.. 15 ఏళ్ళకు పైగానే ఈయన ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్నుంచి చాలా సినిమాలకు విశాల్‌తో కలిసి పని చేసాడు.

విశాల్‌ తమకు ఇవ్వాలని రూ.8.29 కోట్లు ఇచ్చే వరకు ఈ సినిమా విడుదలను నిలిపేయాలని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్ అధినేతలు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు.

ఈ మధ్య తమిళ స్టార్స్ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతున్నారు. తాజాగా హీరో విశాల్ హీరోకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. విశాల్ నటించిన కొత్త సినిమా చక్ర విషయంలో వివాదం తలెత్తింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ అనే మరో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విశాల్, ఎంఎస్ ఆనందన్‌లకు నోటీసులను జారీ చేసింది. చక్ర సినిమాకు ఎంఎస్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మించాడని సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమాను.. ధియేటర్లు తెరవకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాలని విశాల్‌ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే విశాఖ చక్ర సినిమాపై వివాదం చెలరేగడం వెనుక అసలు కారణం వేరే ఉంది. సుందర్ సి డైరెక్షన్‌లో గతంలో విశాల్ యాక్షన్ అనే మూవీలో నటించాడు. ఈ సినిమాను రూ. 44 కోట్ల భారీ వ్యయంతో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించింది. ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు విశాల్‌ గ్యారెంట్‌ ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ‌ సినిమా కేవలం రూ. 11.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ నష్టాలను భరించడానికి విశాల్‌ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్‌ డైరెక్షన్‌లో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో చేస్తానని హామీ ఇచ్చాడని ట్రైడెంట్ సంస్థ వాదిస్తోంది. అయితే ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్‌లో నిర్మించాడు. అలాగే ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో విశాల్‌ తమకు ఇవ్వాలని రూ.8.29 కోట్లు ఇచ్చే వరకు ఈ సినిమా విడుదలను నిలిపేయాలని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్ అధినేతలు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు.

First published:

Tags: Kollywood News, Vishal

ఉత్తమ కథలు