Vishal: విశాల్‌కు మద్రాస్ హై కోర్టు షాక్.. 8 కోట్లు ఇస్తేనే రిలీజ్‌కు గేట్స్ ఓపెన్..

Vishal: తమిళ హీరో విశాల్ సినిమాలతోనే కాదు అప్పుడప్పుడూ వివాదాలతో కూడా బిజీగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన ఇదే చేసాడు. తాజాగా ఈయన తన సినిమా విషయంలో వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో చక్ర అనే సినిమాతో వస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2020, 10:33 PM IST
Vishal: విశాల్‌కు మద్రాస్ హై కోర్టు షాక్.. 8 కోట్లు ఇస్తేనే రిలీజ్‌కు గేట్స్ ఓపెన్..
విశాల్ (Hero Vishal)
  • Share this:
తమిళ హీరో విశాల్ సినిమాలతోనే కాదు అప్పుడప్పుడూ వివాదాలతో కూడా బిజీగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన ఇదే చేసాడు. తాజాగా ఈయన తన సినిమా విషయంలో వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో చక్ర అనే సినిమాతో వస్తున్నాడు. రెండేళ్ల కింద వచ్చిన అభిమన్యుడు మాదిరే ఇది కూడా పూర్తిగా సైబర్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాను తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు ఈ హీరో. షూటింగ్ కూడా పూర్తి కావడంతో దీపావళికి ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నాడు విశాల్. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఈ సినిమా విడుదల ఆపాలంటూ మద్రాస్ హై కోర్టు స్టే ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
విశాల్ (Hero Vishal)
విశాల్ (Hero Vishal)


దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. విశాల్‌తో గతంలో యాక్షన్ అనే సినిమాను నిర్మించిన ట్రిడెంట్ ఆర్ట్స్ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమాతో తాము భారీగా నష్టపోయామని.. దాంతో తమకు నెక్ట్స్ సినిమా చేస్తానని చెప్పిన విశాల్ ఇప్పుడు మాట మార్చాడంటూ వాళ్లు కోర్టు మెట్లెక్కారు. అందుకే తమకు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించకుండా ‘చక్ర’ సినిమా విడుదల కాకూడదని వాదనలు వినిపించింది ఆ నిర్మాణ సంస్థ. దీంతో విచారణ చేపట్టిన మద్రాస్ హై కోర్టు స్టే విధించింది. ట్రిడెంట్ ఆర్ట్స్ సంస్థ యాక్షన్ సినిమాను 44 కోట్లతో నిర్మించింది.
విశాల్ (Hero Vishal)
విశాల్ (Hero Vishal)

అయితే ఈ సినిమాకు కనీసం 20 కోట్లు కూడా రాలేదు. దాంతో తమకు భారీ నష్టం వచ్చిందని చెప్తే.. తర్వాతి సినిమాను మీకే చేస్తానంటూ విశాల్ మాటిచ్చాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా సొంత సంస్థలో చక్ర సినిమా చేసాడు. దాంతో ఇదే విషయం వాళ్లు కోర్టుకు తెలిపారు. యాక్షన్ సినిమా అప్పట్లో తమిళనాడులో 7.7 కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు వసూళ్లని రాబట్టింది. డిజిటల్ రూపంలో మరో 10 కోట్లు వచ్చాయి. దాంతో నిర్మాతలు దాదాపు 20 కోట్ల వరకు నష్టపోయారు.
విశాల్ (Hero Vishal)
విశాల్ (Hero Vishal)

ఆ నష్టాన్ని పూడ్చడానికి విశాల్ తన తదుపరి చిత్రాన్ని తమ సంస్థకే చేస్తానని మాటిచ్చి తప్పాడంటూ ఆరోపిస్తుంది ట్రిడెంట్ ఆర్ట్స్. అయితే ఆ మాటకు విరుద్ధంగా తన సొంత నిర్మాణ సంస్థలోనే చక్ర సినిమాను చేయడంతో వాళ్లు కోర్టుకు తమ గోడు విన్నవించుకున్నారు. తమకు 8.29 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లిస్తే కానీ ఈ సినిమాను విడుదల చేయకూడదంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. స్టే విధించాలని నిర్మాణ సంస్థ కోరినట్లే హై కోర్టు కూడా చేసింది. దీనిపై విశాల్ ఎలా స్పందిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే చక్ర సినిమాలో విలన్‌గా రెజీనా నటించడం విశేషం. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్.
Published by: Praveen Kumar Vadla
First published: September 22, 2020, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading