చిరు, బాలయ్య..ఇపుడు మాధురి

మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. మన దగ్గర ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ఎంటరైయ్యారు. అందులో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వాళ్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.తాజాగా ఈ లిస్ట్‌లో మాధురి దీక్షిత్ కూడా ఉన్నారు.

news18-telugu
Updated: December 6, 2018, 6:26 PM IST
చిరు, బాలయ్య..ఇపుడు మాధురి
చిరు, మాధురి, బాలయ్య,
  • Share this:
మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. మన దగ్గర ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ఎంటరైయ్యారు. అందులో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వాళ్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.

ఆ బాటలో చాలా మంది నటీనటులు పాలిటిక్స్‌లో ఎంటరై తమ లక్‌ను పరీక్షించుకున్నారు. ఇప్పటికే తెలుగు నేలపై చిరంజీవి కూడా ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసాడన్నది తర్వాతి సంగతి. మరోవైపు బాలకృష్ణ కూడా ప్రస్తుతం టీడీపీ తరుపున శాసనసభ్యునిగా కొనసాగుతున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పేరుతో రాజకీయ పార్టీని రన్ చేస్తున్నాడు. ఒకప్పటి లేడి సూపర్ స్టార్ విజయ్ శాంతి కూడా తెలంగాణ స్టార్ క్యాంపెనర్‌గా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

తమిళనాడు విషయానికొస్తే.. ఎంజీఆర్, జయలలితలతో పాటు కరుణానిధి కూడా సినీ నేపథ్యంతోనే రాజకీయ అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత శివాజీ గణేషణ్, శరత్ కుమార్, విజయ్ కాంత్, కార్తీక్ వంటి ఎంతో మంది నటులు రాజకీయాల్లో ప్రవేశించినా అంతగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం తమిళనాడులో కమల్ హాసన్..మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. మరోవైపు రజినీకాంత్ కూడా త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు.

మరోవైపు ఉత్తరాదికి చెందిన చాలా మంది నటీనటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో సంజయ్ దత్ ఫాదర్ దివంగత సునీల్ దత్ కాంగ్రెస్ తరుపున కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరోవైపు వినోద్ ఖన్నా, శతృఘ్న సిన్హా కూడా వాజ్‌పేయి మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ తరుపున సినీ నటి హేమా మాలిని..ఉత్తరప్రదేశ్‌లోని ‘మథుర’ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. మరోవైపు టీవీ సూపర్ స్టార్ స్మృతి ఇరానీ కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు.

తాజాగా రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న హీరోయిన్స్ లిస్ట్‌లో మాధురు దీక్షిత్ కూడా ఉంది. ఈ భామ..బీజేపీ తరుపున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూణే నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్టు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మరి సినిమాల్లో రాణించిన మాధురి దీక్షిత్ రాజకీయాల్లో కూడా రాణిస్తుందా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 6, 2018, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading