సీనియర్ హీరోయిన్, అలనాటి అందాల తార మాధురి దీక్షిత్ (Madhuri Dixit) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి స్నేహలతా దీక్షిత్ (91) (Madhuri Dixit mother Death) మృతి చెందారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గత రాత్రి కన్నుమూసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆదివారం తెల్లవారు ఝామున ఆమె తుది శ్వాస విడిచారు. ఈ రోజు (ఆదివారం) ఆమె అంత్యక్రియలు ముంబైలో నిర్వహించనున్నారు.
మాధురి దీక్షిత్ తల్లి మరణించారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు, బాలీవుడ్ వర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తన తల్లి మరణంపై మాధురి దీక్షిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ''ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తే స్వర్గానికి పయనమైంది'' అని పేర్కొంది.
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా, డ్యాన్స్ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది మాధురి దీక్షిత్. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసి 1990లలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ఖల్‌నాయక్ మూవీలో చోళీకే ఫీచే క్యా హై అనే సాంగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 1998లో డా. శ్రీరామ్ నేనే (Dr Sriram Nene)ని వివాహం చేసుకుని.. యూఎస్‌లో సెటిల్ అయ్యింది. చాలా సంవత్సరాలు అక్కడే ఉన్న ఈ నటి ఇటీవలే ఇండియా తిరిగొచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
దాదాపు పదేళ్ల పాటు తన పాటులు, డ్యాన్స్, సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌నే కాదు..సౌత్‌లో కూడా మాధురి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జీగా, కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తోంది మాధురి దీక్షిత్. సినిమాల్లో కనిపించకపోయినా మాధురి దీక్షిత్ సోషల్ మీడియాలో మాత్రం బాగా టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫీలింగ్స్, పర్సనల్ లైఫ్‌కి చెందిన మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటోంది. 1984లో విడుదలైన అబోద్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనీల్ కపూర్‌తో కలిసి తేజాబ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయింది. ఆ తర్వాత వరుస హిట్‌లు రావడంతో తిరుగులేని హీరోయిన్‌గా మారిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bollywood beauty, Madhuri Dixit