ఆ విషయంలో సమంతనే ఆదర్శంగా తీసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ ఒకప్పటి నెంబర్ హీరోయిన్ మాధురి దీక్షిత్.. టాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతున్న సమంతను ఆదర్శంగా తీసుకుంది.

news18-telugu
Updated: December 10, 2019, 9:45 AM IST
ఆ విషయంలో సమంతనే ఆదర్శంగా తీసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్..
సమంత (Instagram/Photo)
  • Share this:
బాలీవుడ్ ఒకప్పటి నెంబర్ హీరోయిన్ మాధురి దీక్షిత్.. టాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతున్న సమంతను ఆదర్శంగా తీసుకుంది. ఇంతకీ మాధురి దీక్షిత్.. సమంత ఆదర్శంగా ఎందుకు తీసుకుందా అని ఆశ్చర్యపోతున్నారా .. ? ఏమి లేదు.. ఈ మధ్యకాలంలో చాలా మంది కథానాయికలు హీరోయిన్‌గా నటిస్తూనే.. వెబ్ సిరీస్‌ల వైపు తమ దృష్టిని సారిస్తున్నారు. ఇప్పటికే కైరా అద్వానీ.. ‘లస్ట్ స్టోరీస్’ చేసిన సంగతి తెలిసిందే కదా. అదే బాటలో సమంత.. ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌లో విలన్ షేడ్స్ వున్న పాత్ర చేస్తోంది. తాజాగా నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి.. ప్రస్తుతం కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తోన్న మాధురి దీక్షిత్ కూడా ప్రముఖ ఓటిటి ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో  ఒక వెబ్ సిరీస్ యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కన్ఫామ్ చేసింది.

madhuri dixit act in web series like samantha akkineni,samantha,madhuri dixit,samantha madhuri dixit,samantha web series,madhuri dixit web series,samantha twitter,samantha instagaram,samantha facebook,madhuri dixit facebook,madhuri dixit instagram,madhuri dixit twitter,madhuri dixit,madhuri dixit movies,madhuri dixit web shows,madhuri dixit netflix series,madhuri dixit nene,madhuri dixit new projects,madhuri dixit hit movies,marathi web series,madhuri dixit first movie,madhuri dixit ott debut,madhuri dixit 2019,abodh madhuri dixit,madhuri dixit netflix india,madhuri dixit karan johar,web series,vinod khanna and madhuri dixit movies,karan johar madhuri dixit,bolllywood,hindi cinema,tollywood,family men,సమంత,మాధురి దీక్షిత్,సమంత మాధురి దీక్షిత్,మాధురి దీక్షిత్ వెబ్ సిరీస్,సమంత వెబ్ సిరీస్,అమెజన్ ప్రైమ్,నెట్‌ఫ్లిక్స్
సమంత,మాధురి దీక్షిత్ (Instagram/Photo)


ఇందులో మాధురి దీక్షిత్‌తో పాటు బాలీవుడ్ నటుడు కరణ్ జోహార్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ మాకు క్వీన్ దొరకింది. రాబోయే నెట్‌ఫ్లిక్స్‌లో మీరు అందాన్ని చూడగలరు అంటూ ట్వీట్ చేసాడు. ఏమైనా మాధురి దీక్షిత్ కూడా వెబ్ సిరీస్‌ వైపు రావడం చూసి ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First published: December 10, 2019, 9:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading