MADHAVI LATHA STRONG WARNING TO SRI REDDY AND SATIRES ON BJP LEADER SADINENI YAMINI PK
సాధినేని యామిని Vs మాధవి లత.. మధ్యలో శ్రీ రెడ్డి..
సాధినేని యామిని వర్సెస్ మాధవి లత గొడవలో శ్రీ రెడ్డి ఎంట్రీ (sadineni yamini sri reddy madhavi latha)
Madhavi Latha Vs Sadineni Yamini: మాధవి లత, సాధినేని యామిని మధ్య జరుగుతున్న గొడవలోకి శ్రీ రెడ్డి సడన్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఆడాళ్ల కొట్లాట ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారిపోతుంది.
ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లో కూడా శ్రీ రెడ్డి ఎవర్నీ వదలడం లేదు. అక్కడ కూడా తన కాలు ఒకటి వేసి ఉంచేసింది ఈ ముద్దుగుమ్మ. అవసరం వచ్చినపుడు అలా వాడేసుకుందాంలే అన్నట్లుగా ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా మాధవి లతను టార్గెట్ చేసి శ్రీ రెడ్డి కొన్ని మాటలు అనేసింది. దాంతో ఈమె ఊరుకోకుండా ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి అంటూ ఫోటో పోస్ట్ చేసింది మాధవి లత. దాంతో ఆడాళ్ల కొట్లాట ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారిపోతుంది. మాధవి లత, సాధినేని యామిని మధ్య జరుగుతున్న గొడవలోకి శ్రీ రెడ్డి సడన్ ఎంట్రీ ఇచ్చింది.
సాధినేని యామిని వర్సెస్ మాధవి లత గొడవలో శ్రీ రెడ్డి ఎంట్రీ (sadineni yamini sri reddy madhavi latha)
దాంతో ఇప్పుడు గొడవ మరింత ముదురుతుంది. మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్న సాధినేని యామిని ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలో చేరింది. ఆ విషయంపై బిజేపీ నేత మాధవి లత కాస్త అసహనం వ్యక్తం చేసింది. ఒకప్పుడు మల్లెపూల నలిపే కథలు చెప్పి క్రేజ్ తెచ్చుకున్నవారికి పార్టీలో గుర్తింపు ఇవ్వడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో సెటైర్లు వేసింది మాధవి లత. అప్పట్లో తెలుగుదేశంలో ఉన్నపుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి యామిని సాధినేని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలపడానికి మాత్రమే పనికొస్తాడని అప్పట్లో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
సాధినేని యామిని వర్సెస్ మాధవి లత గొడవలో శ్రీ రెడ్డి ఎంట్రీ (sadineni yamini sri reddy madhavi latha)
ఆ తర్వాత ఈమెను 30 ఇయర్స్ పృథ్వీ కూడా టార్గెట్ చేసాడు. మల్లెపూలు ఎలా నలిపించుకోవాలో యామినికి తెలిసినట్లు ఎవరికీ తెలియదేమో అన్నాడు ఆయన. మాధవి లత కూడా సాధినేని యామినిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వాళ్లకు.. మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వాళ్లకు ఇక్కడ పదవులు ఇస్తారా అంటూ రెచ్చిపోయింది. దాంతో సాధినేని యామినిపై చేసిన కామెంట్స్‌తో విచిత్రంగా శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. అసలు ఈమె మధ్యలో ఎందుకొచ్చిందో అర్థం కాలేదు.
యామిని సాధినేనికి నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయాల్సి వస్తుందంటూ శ్రీ రెడ్డి ఫైర్ అయిపోయింది. దాంతో ఇప్పుడు మాధవి లత కూడా కౌంటర్ వేసింది. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరిగే పోటో పోస్ట్ చేసింది మాధవి లత. అక్కడ శ్రీ రెడ్డిని టార్గెట్ చేసిందనే విషయం అర్తమైపోతుంది. పైగా తాను ఎవర్ని అంటున్నానో అర్థమవుతుందా అంటూ ప్రశ్నించింది మాధవి. మొత్తానికి రాజకీయాల్లో కూడా ఆడాళ్లు మామూలు రచ్చ చేయడం లేదు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.