HOME »NEWS »MOVIE »madhavi latha coming with pawan kalyan movie title here are the details sr

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో బీజేపీ నేత సినిమా..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో బీజేపీ నేత సినిమా..
‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Pawan Kalyan : `సత్యా గ్రహి ` అంటూ పవన్ కళ్యాణ్ దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితమే ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    `సత్యా గ్రహి ` అంటూ పవన్ కళ్యాణ్ దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితమే ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు ఆయనే దర్శకుడు అని చెప్పారు. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కించాలనీ భావించిన ఈ సినిమా ఏవో కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తి తో “సత్యాగ్రహి” చిత్రాన్ని శ్రీ భవిత క్రియేషన్స్ పతాకం పై గంగారెడ్డి నిర్మిస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ మాధ‌వీల‌త నటించనుంది. మాధవీ లత.. తనీష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. ఆ తర్వాత ‘స్నేహితుడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలా కొన్ని సినిమాల్లో నటించిన మాధవీ లత ఆ తర్వాత తెలుగు సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

    madhavi latha controversial comments, madhavi latha news, madhavi latha,madhavi latha interview,madhavi latha movies,actress madhavi latha,actress madhavi latha gives clarity about her facebook post,madhavi latha facebook,madhavi latha exclusive interview,madhavi latha about pawan kalyan,madhavi latha facebook post,madhavi latha latest interview,heroine madhavi latha interview,actress madhavi latha interview, మాధవీలత, మాధవీలత న్యూస్
    సత్యాగ్రహిలో మాధవీలత Photo : Facebook




    ఇక ఈ సత్యాగ్రహి లుక్ ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసింది చిత్రబృందం. ఈ లుక్ లో బ్యాక్ సైడ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోస్ట‌ర్ ఉండ‌గా, మాధ‌వి ల‌త మైక్ ప‌ట్టుకుని స్పీచ్ ఇస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో మాధ‌వీల‌త పొలిటిక‌ల్ క్యార‌క్ట‌ర్ లో న‌టిస్తున్న‌ట్లు అర్థ‌మవుతోంది. అంతేకాదు తెలుస్తోన్న సమాచారం మేరకు.. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమాజం పై యవత బాధ్యత తో ఉండాలని చెబుతూ … పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయిన ఓ నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనేది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకుల్నీ ఏవిధంగా ఆకర్షించగలదో చూడాలి.
    Published by:Suresh Rachamalla
    First published:September 03, 2020, 06:48 IST

    टॉप स्टोरीज