MADHAVI HUSBAND SHOCKING TWIST TO TULASI MOTHER IN LAW ANASUYA IN INTINTI GRUHALAKSHMI SERIAL TODAY EPISODE NR
Intinti Gruhalakshmi: గయ్యాళి అత్తకు షాక్ ఇచ్చిన మాధవి భర్త.. నీ కూతురు విడాకులు ఇవ్వాల్సిందే అంటూ?
Intinti Gruhalakshmi
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదరణతో గుర్తింపు పొందింది. అంతేకాకుండా స్టార్ మా లో రేటింగ్ విషయంలో కూడా అత్యధిక స్థాయిలో ఉంది.
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదరణతో గుర్తింపు పొందింది. అంతేకాకుండా స్టార్ మా లో రేటింగ్ విషయంలో కూడా అత్యధిక స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు ఈ సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక నందు.. లాస్య కోసం తులసి కి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తాము కలిసి ఉండేది కొద్ది రోజులు కాబట్టి సంతోషంగా జీవిస్తున్నారు తులసి, నందు. ఇక అనుకోకుండా ఎంతో అన్యోన్యంగా ఉండే మాధవి, మోహన్ దంపతులు అనుకోకుండా మరి దగ్గరనుండి విడాకుల విషయం బయటికి వస్తుంది.
ఈ క్రమంలో తన భర్త నుండి తనకు పిల్లలు పుట్టలేదని విడాకులు కోరుకుంటున్నారని మాధవి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ తెలుపుతుంది. దీంతో కుటుంబ సభ్యులు దానికి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు మేమున్నాము అంటూ భరోసా ఇస్తారు. నందు కూడా మాధవి పై కోపంతో రగిలిపోతాడు. ఇక తులసి, నందు మోహన్ నిలదీయడానికి మోహన్ ఇంటికి బయలుదేరుతారు. ఇక అక్కడ మోహన్ ను మాధవి అమాయకురాలు అంటూ తన జీవితంతో ఆడుకోవాలని అనుకుంటే ఊరుకునేది లేదు అంటూ ఆవేశంతో రగిలిపోతాడు. దీంతో వెంటనే మోహన్ నందు మాట్లాడే విధానాన్ని చూసి విచిత్రంగా ఉంది అంటూ, నవ్వొస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడతారు. మధ్యలో తులసి కూడా కలుగ చేసుకోగా ఇలా ఆలోచన రావడానికి మీ ఆయనే కారణం అంటూ తనతో అంటాడు.ఇక నందు, తులసి అక్కడినుంచి మౌనంగా వెళ్తారు.
ఇక మాధవి ఇంటికి వచ్చిన విషయాన్ని, ఆత్మహత్య విషయాన్ని భాగ్య.. లాస్య తో మొత్తం చెబుతుంది. ఇక లాస్య గట్టిగా ఆలోచిస్తూ.. మాధవి మీద అనుమానం పెంచుకుంటుంది. తను ఇలా చేసే రకం కాదు అంటూ.. తన ప్రవర్తన ఇలా ఉండేది అంటూతెగ ఆలోచిస్తూ భాగ్య తో చెబుతుంది. ఇక భాగ్య కూడా నాకు కూడా అనుమానం వస్తుంది అంటుంది. ఈ సమయంలో తను ఎటువంటి ప్లాన్ చేసిన వర్కవుట్ కాదని అనుకుంటుంది. ఇక నందు గురించి తన ప్లాన్ అంతా పాడవుతుందని భాగ్య తో చెబుతుంది. ఇక నందు ఇంట్లో మాధవి ఏడుస్తూ తన కుటుంబ సభ్యుల ముందు తన భర్త గురించి నిలదీసినట్లు మాట్లాడుతుంది. అంతేకాకుండా నందు కి తగిలేటట్లుగా గట్టిగానే మాట్లాడుతుంది. ఇక అంకిత ఫారన్ కోసం అభి తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కమింగ్ అప్ లో నందు కుటుంబం మొత్తం ఉన్న సమయంలోమోహన్ విడాకుల పత్రం తీసుకుని మాధవి తీస్తాడు. 24 గంటల్లో సైన్ పెట్టమని ఆర్డర్ చేసి వెళ్తాడు. ఇక అనసూయ అరుస్తూ ఉంటే కూడా మాట వినేది లేదు అనుకుంటూ తెగేసి చెబుతాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.