MADHAVI HUSBAND SHOCKING TWIST TO TULASI HUSBAND NANDU IN GRUHALAKSHMI SERIAL TODAY EPISODE NR
Intinti Gruhalakshmi: 'నందు'కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చెల్లి భర్త.. పిల్లలు పుట్టడంలేదు.. అందుకే విడాకులు?
Intinti Gruhalakshmi
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ తర్వాత మంచి ఫెమ్ లో ఉన్న సీరియల్ ఇది. ఇక ఈ సీరియల్ కాస్త కొత్త కథతో ప్రసారం అవుతూ ఉండగా.. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ తర్వాత మంచి ఫెమ్ లో ఉన్న సీరియల్ ఇది. ఇక ఈ సీరియల్ కాస్త కొత్త కథతో ప్రసారం అవుతూ ఉండగా.. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అంకితను అభి కొట్టడానికి చేయి లేపగా.. అదే సమయంలో అంకిత తల్లిదండ్రులు రావడంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు అభి. ఇక దీనిని అవకాశాన్ని తీసుకోవడానికి ఈరోజు ఈ సింపతీ తో ఫారెన్ కి వెళ్లడానికి ఒప్పించమంటుంది అంకిత తల్లి. దీంతో అభి బెడ్ రూంలోకి వచ్చేసరికి అంకిత ఏడుస్తున్నట్లుగా కూర్చొని.. మొత్తానికి అభితో ఎమోషనల్ గా ప్లాన్ చేసేస్తుంది అంకిత. దీంతో అభి కూడా ఒప్పుకుంటాడు.
ఇక తులసి.. నందు తనకు థాంక్స్ చెప్పడాన్ని తలుచుకుంటూ బాగా పొంగిపోతుంది. అది చూసిన తన మామగారు, ప్రేమ ఇద్దరు వచ్చి ఇదే నందుని కలవడానికి మంచి అవకాశం అంటూ కాసేపు మాట్లాడుతుంటారు. ఇక ఆ తర్వాత కొద్ది సేపటికి మాధవి బ్యాగ్ పట్టుకొని ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ కూర్చుంటుంది. ఏం జరిగింది అంటూ కుటుంబ సభ్యులంతా అడుగుతుంటారు. ఇక భాగ్య వెటకారంతో వెటకారం మాటలు మాట్లాడుతుంది. దీంతో భాగ్యం మాటలను అక్కడి వారికి ఆపివేస్తుంది తులసి. ఇక నందు ఎలాగైనా మోహన్ ని అడుగాలి అంటూ తెగ రెచ్చిపోతాడు. ఇక తులసి నందుని ఇప్పుడు అడగటానికి సరైన సమయం కాదని ఆపుతుంది. ఇక కొద్దిసేపటి తర్వాత మాధవి ఆత్మహత్యాయత్నం చేసుకుంటుండగా అద్దం లో నుంచి చూస్తాడు నందు. ఇక కుటుంబ సభ్యులు ఏం జరిగింది అని గట్టిగా అడుగగా విడాకులు ఇస్తానంటున్నారు అని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.
ఇక తర్వాత ఎపిసోడ్ లో మోహన్ నిలదీయడానికి తులసి, నందు అక్కడికి చేరుకుంటారు. ఇక నందు తన జీవితంతో ఆడుకోవడం చూస్తే అస్సలు ఊరుకునేది లేదు అనగా.. మీరు నీతులు మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది.. నవ్వొస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడుతాడు మోహన్. ఇక మాధవి అలా చేసుకోవడానికి కారణం ఏంటి అని మోహన్ ను అడగగా నాకు పిల్లలు ఇవ్వట్లేదని వదిలేస్తున్నాను అని సింపుల్ గా చెప్పేస్తాడు. అంతేకాకుండా ఇలాంటి ఆలోచన నాకు రావడానికి కారణం మీ ఆయననేనమ్మా అని తులసితో అంటాడు మోహన్. ఇదంతా చూసినట్లయితే మాధవి, మోహన్.. నందు, తులసి ల కోసం ఆడుతున్న డ్రామా అని అనిపిస్తుంది. ఒకవేళ ఈ విషయం నిజమే అయినా సరే నందు కి మాత్రం ఎదురుదెబ్బ తగిలినట్లు ఉంటుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.