మత పిచ్చితో మాధవన్‌పై మండిపడిన ఫ్యాన్... రిప్లైతో కౌంటర్ ఇచ్చిన హీరో

మతపరమైన అంశాలు చాలా సందర్భాల్లో వివాదం అవుతున్నాయి. హీరో మాధవన్ విషయంలోనూ అదే జరిగింది. మత పిచ్చితో ఆలోచించిన నెటిజన్‌కి కళ్లు తెరిపించాడు మాధవన్.

Krishna Kumar N | news18-telugu
Updated: August 17, 2019, 8:56 AM IST
మత పిచ్చితో మాధవన్‌పై మండిపడిన ఫ్యాన్... రిప్లైతో కౌంటర్ ఇచ్చిన హీరో
వైరల్ అయిన ఫొటో (Image : Twitter - JIXSA)
  • Share this:
స్టార్ హీరో మాధవన్ ఇటీవల... రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంటూ... తన తండ్రి, కొడుకుతో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఆయన... జంద్యం వేసుకొని... సంప్రదాయ హిందువులా కనిపించారు. ఐతే... ఆ ఫొటోను గుచ్చి గుచ్చి చూసిన ఓ మహిళ... మాధవన్ వెనక శిలువ ఉండటం చూసి అదేదో తప్పు అన్నట్లుగా మండిపడింది. మీ పూజ గదిలో శిలువ ఎందుకు ఉంది? మీరు మతం పరువు తీశారు. మీపై ఉన్న గౌరవం పోయింది. చర్చిల్లో హిందూ దేవుళ్లు కనిపించరు... కానీ హిందువైన మీ ఇంట్లో శిలువ ఉండటం నాకు నచ్చలేదు. మీరు హిందూ సాంప్రదాయాల్ని ఆచరిస్తున్నారన్నది అబద్ధం. ఈ ఫొటో ఫేక్ అని జిక్సా అనే మహిళా నెటిజన్ ఫైర్ అయ్యింది.


మత పిచ్చితో ఆమె చేసిన కామెంట్‌కి ఘాటైన రిప్లై కౌంటర్ ఇచ్చారు మాధవన్. "ముందు మీకు పట్టిన రోగం త్వరలో నయం కావాలని అనుకుంటున్నా... మీ లాంటి వాళ్లు గౌరవించకపోయినా నాకే నష్టమూ లేదు. నాకు అన్ని మతాలూ సమానమే. అన్ని మతాల్నీ మా కుటుంబం విశ్వసిస్తుంది. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అని కాదు... ప్రతి మతానికి మా ఇంట్లో ప్రవేశం ఉంది. మీకు కనిపించలేదనుకుంటా.. ఆ ఫొటోలో గోల్డెన్‌ టెంపుల్‌ కూడా ఉంది. గుడి, చర్చ్, దర్గా... దేనికైనా వెళ్లడం మంచి అవకాశంగా భావిస్తా. ఎందుకంటే నాకు మీకున్న జబ్బు నాకు లేదు" అంటూ ఆమెకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు మాధవన్.
నెటిజన్లు కూడా మాధవన్‌కి సపోర్ట్‌గా నిలిచారు. ఆయన రిప్లైకి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>