MADHAVAN CLARIFIES ABOUT RATAN TATA BIOPIC IN SUDHA KONGARA DIRECTION TA
Madhavan-Ratan Tata: రతన్ టాటా బయోపిక్ విషయంలో స్పందించిన మాధవన్..
రతన్ టాటా బయోపిక్ పై స్పందించిన మాధవన్ (File/Photo)
Madhavan-Ratan Tata: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, డాన్ ప్రముఖులతో పాటు వ్యాపారస్థుల జీవితాన్ని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాపై బయోపిక్ తెరకెక్కుతోంది. ఇందులో రతన్ టాటా పాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు వస్తున్న వార్తలపై మాధవన్ స్పందించారు.
Madhavan-Ratan Tata: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, డాన్ ప్రముఖులతో పాటు వ్యాపారస్థుల జీవితాన్ని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా సూర్య హీరోగా ఎయిర్ దక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ కథను స్పూర్తిగా తీసుకొని కొన్ని సినిమాటిక్ ఛేంజెస్ చేసి ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. తమిళంలో సూరారై పోట్రుగా వచ్చిన ఈ సినిమాను స్వయంగా సూర్య నిర్మించాడు. సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గునీత్ మోంగా కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆమెకు తాజాగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సుధ కొంగర ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా జీవితంపై ఓ బయోపిక్ మూవీని తెరకెక్కించే పనిలో ఉంది.. భారతీయ వ్యాపార ప్రపంచంలో టాటాల ప్రస్తావన లేకుండా ఉండదు. అన్ని విభాగాల్లోనూ టాటా గ్రూప్ అడుగు పెట్టింది. అయితే, విమానయాన రంగంలో కూడా అడుగు పెట్టడానికి రతన్ టాటా చాలా ప్రయత్నాలు చేశారని, అయితే, ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదనే అర్థం వచ్చేలా ఆకాశమే నీ హద్దురా సినిమాలో చూపించారు. ‘సాక్షాత్తూ రతన్ టాటానే 30 ఏళ్ల పాటు కాళ్లు అరిగేలా తిరిగి తిరిగి అలసిపోయాడు. నువ్వెంత.’ అని ఓ విమానయాన శాఖ అధికారి హీరో సూర్యతో అనే డైలాగ్ కూడా అందులో ఉంది.
సుధా కొంగర (Sudha Kongara)
భారతదేశ వ్యాపార రంగంలో ప్రముఖమైన వ్యక్తి, బ్యాచ్‌లర్, ఏంజిల్ ఇన్వెస్టర్ అయిన రతన్ టాటా బయోపిక్‌ను తీసేందుకు సుధ కొంగ సిద్ధమైనట్టు తెలిసింది. ఐతే.. ఈ సినిమాలో మాధవన్ రతన్ టాటా పాత్రలో యాక్ట్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై మాధవన్ స్పందించారు.అంతేకాదు రతన్ టాటాగా మాధవన్ నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టర్స్ కూడా హల్‌చల్ చేస్తున్నాయి.
@ActorMadhavan Is this true that You are gonna play a lead role in Ratan Tata Biopic?? 🥺❤️ if this happens it's gonna be a huge inspiration to many😍 pic.twitter.com/SLX6Y1YoyO
రతన్ టాటా బయోపిక్‌లో నేను నటించబోతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఎవరు కూడా తనను ఈ బయోపిక్ విషయమై మాట్లాడలేదు. ఒకవేళ వస్తే అంతకన్న అదృష్టం లేదననారు. గతంలో సుద కొంగర.. మాధవన్‌తో ‘సాలా ఖడూస్’ సినిమాను తెరకెక్కించడంతో తాజాగా ఆమె తెరకెక్కించబోతున్న ప్రాజెక్ట్‌లో మాధవన్.. రతన్ టాటా పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మాధవన్.. ప్రముఖ సైంటిస్ట్ నంబి పాత్రలో‘రాకెట్రీ’ సినిమా చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.