Mosagallu : ప్రముఖ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న మంచు విష్ణు కాజల్ అగర్వాల్ మోసగాళ్ళు..

Manchu Vishnu Kajal Aggarwal Mosagallu Photo : Twitter

Mosagallu : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన చిత్రం మోసగాళ్ళు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

  • Share this:
    మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన చిత్రం మోసగాళ్ళు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా కథనం వీక్‌గా ఉండడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. విష్ణు ప్రధాన పాత్రలో కనిపించగా.. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటించారు. అది అలా ఉంటే ఈ సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. చూడాలి మరి ఓటీటీలో ఈ సినిమా ఎలా అలరించనుందో.. ప్యాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో నిజ జీవిత సంఘటనల నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల స్కామ్ నేపథ్యంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

    ఇక  విష్ణు నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే... విష్ణు ప్రధాన పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు 'భక్త కన్నప్ప'గా కనిపించనున్నారు. దీనికి తోడు ప్రస్తుతం విష్ణు ఢీకి సిక్వెల్‌గా వస్తున్న ఢీ ఢీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చిరంజీవి కొరటాల శివ ఆచార్య కాజల్ చిరంజీవికి జోడిగా నటిస్తోంది.

    mosagallu collections, Machu Vishnu Kajal Aggerwal ,Mosagallu Twitter Review,Mosagallu Movie Review,Mosagallu Movie Twitter Review,Manchu Vishnu Kajal aggarwal Mosagallu Twitter Review,Manchu Vishnu,Kajal Aggarwal,tollywood,Bollywood,మోసగాళ్లు ట్విట్టర్ రివ్యూ,మోసగాళ్లు మూవీ,మోసగాళ్లు మూవీ రివ్యూ,మోసగాళ్లు ట్విట్టర్ రివ్యూ,మంచు విష్ణు కాజల్ అగర్వాల్ మోసగాళ్లు ట్విట్టర్ రివ్యూ,మోసగాళ్లు రివ్యూ
    మోసగాళ్ళు: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ తెరకెక్కించిన చిత్రం మోసగాళ్లు. Photo : Twitter


    ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. పూజా హెగ్డే రామ్ చరణ్‌‌కు జోడిగా కనిపించనుంది. ఇక కాజల్ ఈ సినిమాతో పాటు నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నాగార్జునకు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు శంకర్ దర్శకత్వంలో మొదలైన భారతీయుడు 2లో కూడా కమల్ సరసన హీరోయిన్‌ పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వలన షూటింగ్ వాయిదా పడింది.
    Published by:Suresh Rachamalla
    First published: