Gopichand Yagnam @ 17 Years: గోపీచంద్ తొలి బ్లాక్‌బస్టర్ ‘యజ్ఞం’ సినిమాకు 17 ఏళ్ళు పూర్తి..

గోపీచంద్ యజ్ఞం సినిమా (Gopichand Yagnam movie)

Gopichand Yagnam @ 17 Years: మ్యాచో హీరో గోపీచంద్(Gopichand Yagnam) ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్ళు దాటిపోయింది. కానీ ఈయన హీరోగా తొలి విజయం అందుకుని మాత్రం 17 ఏళ్ళైంది. 2004 సంక్రాంతికి వర్షంతో విలన్‌గా రప్ఫాడించిన గోపీచంద్.. అదే ఏడాది యజ్ఞం సినిమాతో హీరోగా మారాడు.

  • Share this:
మ్యాచో హీరో గోపీచంద్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్ళు దాటిపోయింది. కానీ ఈయన హీరోగా తొలి విజయం అందుకుని మాత్రం 17 ఏళ్ళైంది. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలి వలపు సినిమా చేసాడు గోపీచంద్. ఇదే సినిమాతో స్నేహ హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఈ చిత్రం వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. దాంతో రెండేళ్లు ఖాళీగానే ఉండిపోయాడు గోపీచంద్. అలాంటి సమయంలో తేజ తెరకెక్కించిన జయం సినిమాతో విలన్‌గా మారాడు గోపీచంద్. ఆ వెంటనే నిజం, వర్షం సినిమాలతో స్టార్ విలన్ అయిపోయాడు. 2004 సంక్రాంతికి వర్షంతో విలన్‌గా రప్ఫాడించిన గోపీచంద్.. అదే ఏడాది యజ్ఞం సినిమాతో హీరోగా మారాడు. ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా సంచలన విజయం సాధించింది.

జులై 2, 2004న విడుదలైన యజ్ఞం సినిమాకు 17 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పట్లో యజ్ఞం సినిమా వసూలు చేసిన మొత్తాన్ని ఓ సారి చూద్దాం..

gopichand,gopichand twitter,gopichand instagram,gopichand yagnam movie,gopichand yagnam movie 17 years,gopichand yagnam movie collections,గోపీచంద్,గోపీచంద్ యజ్ఞం సినిమా,గోపీచంద్ యజ్ఞం సినిమా కలెక్షన్స్gopichand,gopichand twitter,gopichand instagram,gopichand yagnam movie,gopichand yagnam movie 17 years,gopichand yagnam movie collections,గోపీచంద్,గోపీచంద్ యజ్ఞం సినిమా,గోపీచంద్ యజ్ఞం సినిమా కలెక్షన్స్
గోపీచంద్ యజ్ఞం సినిమా (Gopichand Yagnam movie)


నైజాం: 3.72 కోట్లు
సీడెడ్: 0.81 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.19 కోట్లు
ఈస్ట్: 0.70 కోట్లు
వెస్ట్: 0.50 కోట్లు
గుంటూరు: 0.60 కోట్లు
కృష్ణా: 0.45 కోట్లు
నెల్లూరు: 0.35 కోట్లు

ఏపీ + తెలంగాణ: 8.32 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.61 కోట్లు
వరల్డ్ వైడ్: 8.93 కోట్లు

gopichand,gopichand twitter,gopichand instagram,gopichand yagnam movie,gopichand yagnam movie 17 years,gopichand yagnam movie collections,గోపీచంద్,గోపీచంద్ యజ్ఞం సినిమా,గోపీచంద్ యజ్ఞం సినిమా కలెక్షన్స్gopichand,gopichand twitter,gopichand instagram,gopichand yagnam movie,gopichand yagnam movie 17 years,gopichand yagnam movie collections,గోపీచంద్,గోపీచంద్ యజ్ఞం సినిమా,గోపీచంద్ యజ్ఞం సినిమా కలెక్షన్స్
గోపీచంద్ యజ్ఞం సినిమా (Gopichand Yagnam movie)


యజ్ఞం సినిమా నాటికి హీరోగా గోపీచంద్‌కు ఎలాంటి మార్కెట్ లేదు. కానీ అప్పటికే నెంబర్ వన్ విలన్‌గా రూల్ చేస్తున్నాడు. అయినా కూడా ఈయన సినిమాను కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. దాంతో ఈ తరం ఫిల్మ్స్ యజ్ఞం సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ప్రమోషన్ ప్లస్ బడ్జెట్ కలిసి 5.6 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. యజ్ఞం ఫుల్ రన్‌లో 9 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించాడు.
Published by:Praveen Kumar Vadla
First published: