Home /News /movies /

MACHERLA NIYOJAKAVARGAM TRAILER LAUNCH EVENT IN GUNTUR SB

Nithiin: గ్రాండ్‌గా మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్.. స్టేజ్‌పై స్టెప్పులేసిన హీరో,హీరోయిన్లు..!

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నితిన్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నితిన్

నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా" ఈ ఒక్క డైలాగ్ వింటే సినిమా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తోందో అర్ధమౌతుంది.

    గుంటూరులో ఘనంగా జరిగిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  భారీగా అభిమానులు హాజరయ్యారు. యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు భారీగా హాజరయ్యారు.

    రారా రెడ్డి పాటలోని 'రానురాను అంటుంది చిన్నదోయ్' పాపులర్ బిట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ వేడుకలో నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సముద్రఖని, కాసర్ల శ్యామ్, జానీ మాస్టర్ తదితరలు పాల్గొన్నారు. ఇక ట్రైలర్ నిడివి... రెండు నిమిషాల యాభై సెకన్లు నిడివి గల ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్ మా

    రాజప్ప గా సముద్రఖని విలన్ ఎంట్రీ టెర్రిఫిక్ గా వుంది. మాచర్ల లో రాజప్ప తిరుగులేని శక్తి. తన బలంతో ఎన్నికలే లేకుండా ఎమ్మెల్యే గా ఏకీగ్రీవంగా ఎన్నికౌతుంటాడు. ఐతే నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించి తీరుతానని, కలెక్టర్ అది నా భాద్యతని నితిన్, రాజప్పతో ఛాలెంజ్ చేయడం పవర్ ఫుల్ గా వుంది.నితిన్ క్యాజువల్స్ లో స్టన్నింగా కనిపిస్తూనే ఇన్ బిల్ట్ ఊర మాస్ క్యారెక్టరైజేషన్ బ్రిలియంట్ అనిపించాడు. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి. "నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా" ఈ ఒక్క డైలాగ్ వింటే సినిమా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తోందో అర్ధమౌతుంది.

    ట్రైలర్‌లోని యాక్షన్‌ షాట్‌లు అడ్రినాలిన్‌ రష్ ఎఫెక్ట్ ని ఇచ్చాయి. అద్భుతమైన విజువల్స్, మాస్ డైలాగ్స్ ,క్రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన యాక్షన్ ట్రైలర్‌ సెన్సేషనల్ గా వుంది. శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మహతి స్వర సాగర్ ట్రైలర్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం పవర్ ప్యాక్డ్ అనిపించింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Anil Ravipudi, Catherine tresa, Krithi shetty, Nithiin

    తదుపరి వార్తలు