హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu - Prakash Raj: మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు.. నేనొచ్చే వరకు ఆగండి.. ప్రకాష్ రాజ్‌కు మంచు విష్ణు రిప్లై..

Manchu Vishnu - Prakash Raj: మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు.. నేనొచ్చే వరకు ఆగండి.. ప్రకాష్ రాజ్‌కు మంచు విష్ణు రిప్లై..

అన్యాయంగా జరిగిందని.. లోపల ఏదో అక్రమాలు జరిగిపోయాయని ఆరోపించడం తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు మా అధ్యక్షుడు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం 'మా' సభ్యుల హక్కని మంచు విష్ణు తెలిపాడు.

అన్యాయంగా జరిగిందని.. లోపల ఏదో అక్రమాలు జరిగిపోయాయని ఆరోపించడం తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు మా అధ్యక్షుడు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం 'మా' సభ్యుల హక్కని మంచు విష్ణు తెలిపాడు.

Manchu Vishnu - Prakash Raj: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో (MAA Elections) అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మంచు విష్ణు తీరులో చాలా మార్పులు వచ్చాయి. అంతకుముందు కొందరితో మాత్రమే కలిసే అలవాటున్న విష్ణు.. ఇప్పుడు అంతా నా వాళ్లే అంటున్నాడు.

ఇంకా చదవండి ...

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో (MAA Elections) అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మంచు విష్ణు తీరులో చాలా మార్పులు వచ్చాయి. అంతకుముందు కొందరితో మాత్రమే కలిసే అలవాటున్న విష్ణు.. ఇప్పుడు అంతా నా వాళ్లే అంటున్నాడు. ఎన్నికల ముందు వరకు తిట్టుకున్నా కూడా ఇప్పుడు మాత్రం అందరం కలిసి పని చేద్దాం అంటున్నాడు. ఎలక్షన్స్ టైమ్‌లో ఏవేవో అంతా అనుకుంటారు.. ఇప్పుడు మాత్రం పాత విషయాలు తీయకుండి.. హాయిగా కలిసి పని చేసుకుందాం.. మీ సపోర్ట్ కూడా నాకు కావాలంటున్నాడు విష్ణు. ఈ క్రమంలోనే తనతో పోటీ చేసి ఓటమి పాలైన ప్రకాష్ రాజ్‌ను కూడా కలుపుకుపోతున్నాడు విష్ణు. ముఖ్యంగా ఓటమి అనంతరం 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj) ప్రకటించాడు. అంతేకాదు.. తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా విష్ణుకు సందేశం కూడా పంపించాడు ప్రకాష్. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని.. ఎంతో ఆలోచించిన తర్వాత చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు తను ఇండస్ట్రీకి 'అతిథిగా వచ్చాను.. అతిథిగా ఉండాలి' అనే ఉద్దేశంతో చేస్తున్నానని తెలిపాడు ప్రకాష్ రాజ్. ఈ మేరకు 'మా' ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు (Manchu Vishnu)కు ఇలా మెసేజ్ పంపించాడు. దీనిపై మంచు విష్ణు రిప్లై ఇచ్చాడు.. అంతేకాదు ఆ స్క్రీన్‌ షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ప్రకాష్ రాజ్‌: డియర్‌ విష్ణు.. 'మా' ఎన్నికల్లో నువ్వు సాధించిన విజయానికి అభినందనలు.. 'మా'ను ముందుకు నడిపించేందుకు అవసరమైన శక్తినంతా నీకు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ఆల్‌ ది బెస్ట్‌. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి.. నాన్‌-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ ప్రకాష్ రాజ్‌'' అని మెసేజ్ పంపించాడు. దీనికి విష్ణు సమాధానం ఇచ్చారు.


మంచు విష్ణు: మీరు తీసుకున్న నిర్ణయంపై నేను సంతోషంగా లేను.. మీరు నాకంటే పెద్ద వాళ్లు. జీవితంలో గెలుపోటములు సహజం. అవి నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం సర్వసాధారణం. దాన్ని మీరు అనవసరంగా భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరు కూడా భాగమే. మీతో కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్‌ యు అంకుల్‌. దయచేసి తొందరపడొద్దు అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది.

First published:

Tags: Actor prakash raj, Hero manchu vishnu, MAA Elections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు