Home /News /movies /

మెగా ఫ్యామిలీపై Manchu vishnu సంచలన వ్యాఖ్యలు -Maa elections చీకటి కోణాలు -కేసీఆర్, జగన్‌కు సన్మానం

మెగా ఫ్యామిలీపై Manchu vishnu సంచలన వ్యాఖ్యలు -Maa elections చీకటి కోణాలు -కేసీఆర్, జగన్‌కు సన్మానం

మా అధ్యక్షుడు మంచు విష్ణు

మా అధ్యక్షుడు మంచు విష్ణు

Maa elections 2021 : టాలీవుడ్ లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా విమర్శల పర్వం కొనసాగుతున్నది. ప్రధానంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరినీ కలుపుకొని పోతానంటూనే చిరంజీవితోపాటు ఆయన కుటుంబీకుల పేర్లు చెబుతూ విష్ణు చెప్పిన విషయాలు విభేదాలను మరింత పెద్దచేసేలా ఉన్నాయి..

ఇంకా చదవండి ...
తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, వాదోపవాదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. పైకి అందరినీ కలుపుకొనిపోతామని అంటూనే పేరుపేరునా దెప్పిపొడుపులు వినపడుతున్నాయి. హోరాహోరీగా ముగిసిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు.. తండ్రి మోహన్ బాబు, నటుడు నరేశ్ తదితరులతో కలిసి సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. తన విజయానికి కారకులు ఎవరో, ఓడించడానికి ప్రయత్నించింది ఎవరో, ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించిన ప్రకాశ్ రాజ్, నాగబాబులను ఏం చేయబోతున్నాడో విష్ణు వివరించారు. అంతేకాదు, మా ప్రెసిడెంట్ హోదాలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలవబోతున్నట్లు తెలిపారు. వివాదాలు సృష్టించే చీడ పురుగుల్ని దూరం పెట్టాలంటూ చిరంజీవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంచు విష్ణు తాజా ప్రెస్ మీట్ కీలకంగా మారింది..

రామ్ చరణ ఓటు నాకు పడిందా?
మా అసోసియేషన్ పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఆశీస్సులు ఉన్న వ్యక్తే అధ్యక్షుడిగా ఎన్నికవుతూ రాగా, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ఓటమితో తొలిసారి ఆ సెంటిమెంట్ కు బ్రేక్ పడినట్లయింది. విష్ణు విజయం సాధించిన కొద్ది సేపటికే వేరే సినిమా వేదికపై చిరంజీవి మాట్లాడుతూ వివాదాలు రేకెత్తించే పురుగుల్ని దూరంపెట్టాలని చురకలు వేశారు. చిరంజీవి ఆ మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్నారనేది స్పష్టం కాకున్నా, ఎన్నికల విషయంలో ఆయనకు సంబంధించి కీలక విషయాలను మంచు విష్ణు బయటపెట్టారు. మా ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాల్సిందిగా చిరంజీవి కోరారని విష్ణు బాంబు పేల్చారు. అంతేకాదు, రామ్ చరణ్ ఓటు, నాగబాబు తిరుగుబాటుపైనా విష్ణు ఘాటుగా స్పందించారు..

చిరంజీవి తప్పుకోమన్నారు..
‘నన్ను సైడ్ అయిపోమని చిరంజీవి గారు చెప్పారు. రామ్ చరణ్ చరణ్ నాకే ఓటు వేశాడు అనేది అబద్దం. వాళ్ళ నాన్న చెప్పినట్టు చరణ్.. ప్రకాష్ రాజ్ కే ఓటు వేసుంటాడు. ఈ విషయాలు ఎలా ఉన్నా, మాకు బాధ్యత గల అధ్యక్షుడిగా నేను తాజా రాజీనామాలను అంగీకరించబోను. నాగబాబు , ప్రకాష్ రాజ్ ల రాజీనామాలను నేను ఆమోదించను. వాళ్లిద్దరి సపోర్ట్ నాకు కావాలి. ఓటమి వల్ల కొన్నిసార్లు నిరాశ ఉంటది. కానీ స్పోర్టివ్ గా ఉండాలి. నాకు అందరి సలహాలు కావాలి. అందుకే వాళ్లిద్దరి రాజీనామాలను రిజెక్ట్ చేస్తున్నా’అని విష్ణు వ్యాఖ్యానించారు.

జూనియర్ ఎన్టీఆర్ ఓటేయకున్నా..

మా ఎన్నికల్లో పలువురు టాప్ హీరోలు ఓటింగ్ కు దూరంగా ఉండటం తెలిసిందే. ప్రత్యేకంగా ఆయా ప్యానెళ్ల సమర్థకులు లేదా వ్యతిరేకులు మాత్రం కచ్చితంగా ఓటేశారు. విష్ణుకు మద్దతిచ్చిన నందమూరి బాలకృష్ణ ఓటింగ్ కేంద్రం వద్ద సందడి చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనపడలేదు. అయితే, జూనియర్ ఓటేయకున్నా అతని మద్దతు తనకేనని విష్ణు స్పష్టం చేశారు. ‘ తారక్ ఓటు వేయకపోవడం ఆయన పర్సనల్. కానీ నాకు వచ్చిన ఫస్ట్ కాల్ జూనియర్ ఎన్టీఆర్ నుండే. నా తమ్ముడు తారక్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది’అని విష్ణు చెప్పారు.

ఆ ప్యానెల్ వాళ్లతోనూ
తండ్రి మోహన్ బాబు వల్లే మా ఎన్నికల్లో విజయం సాధించానని మంచు విష్ణు అన్నారు. నటుడు నరేశ్ కూడా చాలా వరకు సాయం చేశారని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, పక్కరాష్ట్రాల నుంచి కూడా నటులు వచ్చి తనను ఆశీర్వదించారని గుర్తుచేశారు. ప్యానెల్ మొత్తం గెలవడానికి ప్రయత్నించినా కొందరు ఓడిపోవడం బాధాకరమని, అయితే, ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో గెలిచిన వారిని కూడా కలుపుకొని ముందకుపోతామన్నారు.

ముఖ్యమంత్రులకు సన్మానం
ఇండస్ట్రీకి మేలు, లబ్ది కలిగే దిశగానే తాను పని చేస్తానన్న మంచు విష్ణు.. ప్రభుత్వాల నుంచి అవసరమైన సాయం కోసం త్వరలోనే ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను కలుస్తానని చెప్పారు. అంతేకాదు, మా తరఫున ముఖ్యమంత్రులకు సన్మానం నిర్వహించే ఆలోచన కూడా చేశారాయన. ‘మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏనాడైనా అందరం కలిసి సన్మానం చేస్తామని చెప్పమా? ఇంతకు ముందు అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అది పాటించాలి. కేసీఆర్ ,జగన్ లను కలిసి మన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి’ అని విష్ణు పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Chiranjeevi, MAA Elections, Manchu Vishnu, Mega Family

తదుపరి వార్తలు