మా ఎన్నికలు అయిపోయి వారం రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ దాని వేడి మాత్రం చల్లారడం లేదు. గెలిచిన మంచు విష్ణు హాయిగా ప్రమాణ స్వీకారం చేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో పాటు రాజకీయ నాయకులను కూడా కలుస్తున్నాడు. మా అధ్యక్షుడిగా ఇండస్ట్రీకి ఏం మేలు చేయాలా అంటూ తిరుగుతున్నాడని మోహన్ బాబు చెప్తున్నాడు. తన వారసుడు అనుకున్నది చేసి చూపిస్తాడని ధీమాగా చెప్తున్నాడు కలెక్షన్ కింగ్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమకు బాగా కావాల్సిన వాళ్లని.. ఇండస్ట్రీ సమస్యల గురించి చెప్పి ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా తీసుకొస్తామని చెప్తున్నాడు మంచు విష్ణు. మరోవైపు మా అసోసియేషన్‌లో ఉన్న గొడవల గురించి మాత్రం పెద్దగా మాట్లాడటం లేదు విష్ణు. గెలిచిన తర్వాత కేవలం పనులపై ఫోకస్ చేయాలి కానీ అనవసరమైన విషయాలపై కాదంటున్నాడు ఈయన. తాజాగా ఈయన అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసాడు.
ఒక గేమ్ ఆడినప్పుడు విన్నర్ అనేది ఒకరే ఉంటారు. రన్నర్ ఒకరు ఉంటారు. ఇక్కడ ఓడిపోవడం అనేది ఉండదు.. ఓడిపోయారని ఎవర్నీ చెప్పలేదని తెలిపాడు విష్ణు. మేము గెలిచాం.. అవతలి పానల్ వాళ్లు సహకరించాలని కోరాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లు కొంత మంది రాజీనామా చేశారని.. అది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పాడు మంచు విష్ణు. అదే విధంగా రాజీనామా చేసినా తాము ముందుకు వెళతామని మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
వాళ్ల రాజీనామాలు తమను ఆపలేవని చెప్పాడు మంచు వారబ్బాయి. ‘మా’ అసోసియేషన్ ఇంకా ధృడంగా ఉంటుందని.. అదే విధంగా ముందుకు వెళుతుందన్నారు విష్ణఉ. ఇకపై తాను జరగబోయే పనుల గురించి మాట్లాడుతాను కానీ అనవసరంగా మీడియా ముందుకొచ్చి మా ఎన్నికల గురించి మాత్రం మాట్లాడనంటున్నాడు ఈయన. ఇంత కాలం మా ఎన్నికలతో ప్రేక్షకును ఎంటర్‌టైన్ చేశామని చెప్పాడు విష్ణు. వేరే దేశాలలో ఉన్న వాళ్లు కూడా తనకు ఫోన్‌లో విషెస్ చెప్పారని తెలిపాడు విష్ణు.
మోహన్ బాబు కొడుకుగా.. మీ విష్ణుగా రెండు సంవత్సరాలు ఏం చేయాలో మా అసోసియేషన్‌కు ఏం చేయాలో మాకు తెలుసు అంటున్నాడు విష్ణు. అదే చేసి తీరతానంటున్నాడు ఈయన. మా కు 24 క్రాఫ్ట్స్ సహాయం కావాలని కోరాడు. ఎంతోమంది ప్రేక్షకులు తన గెలుపు కోసం గుడులకు వెళ్లి పూజలు చేశారని.. వాళ్లందరికీ తను మనస్పూర్థిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పాడు విష్ణు. ఎవరి రాజీనామాలు తమను ఆపలేవనే మాట అన్నాడంటే.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ రిజైన్స్ గురించి విష్ణు పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. అంటే ఇది ఇప్పట్లో తెగే పంచాయితీ కాదన్నమాట. మరి దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actor prakash raj, Hero manchu vishnu, MAA Elections, Telugu Cinema, Tollywood