మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో(Kishan Reddy) మంచు విష్ణు సమావేశం అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రితో విష్ణు ఏం మాట్లాడారన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. మంచు విష్ణు తనను కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ భేటీఏం చర్చించారు.. దేనిపై మాట్లాడారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
అయితే వీరిద్దరి భేటీ ఇప్పుడు.. సినీ, రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు(Mohan Babu).. బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంచు విష్ణు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని(Kishan Reddy) కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మోహన్ బాబు తో పాటూ మంచు విష్ణు కూడా బిజెపిలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.గతంలో మోహన్ బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయిన విషయం తెలిసిందే. దాదాపు అరగంట పాటు.. ప్రధానితో మంచు ఫ్యామిలీ సమావేశం కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో అప్పుడే అంతా మోహన్ బాబు బీజేపీలోకి వెళ్లిపోతారని జోరుగా ప్రచారం కూడా చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు కూడా.. బీజేపీ(BJP) సీనియర్ నేత, కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డిని భేటీ అవ్వడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తుంది.
MAA - Movie Artist Association president Shri @iVishnuManchu called on Hon Union Minister Shri @kishanreddybjp in Hyderabad today. pic.twitter.com/EdBfS2VUyS
— Office of G. Kishan Reddy (@KishanReddyOfc) May 14, 2022
అయితే మరికొందరు మాత్రం మా (MAA)అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణు.. సినిమా రంగం అభివృద్ధి కోసం కిషన్ రెడ్డిని కలిసి ఉంటారని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మంచు విష్ణు స్పందించాల్సిందే. అయితే ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా వెల్లడించే మంచు విష్ణు కిషన్ రెడ్డితో భేటీ అయిన విషయాన్ని మాత్రం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు.దీంతో భేటీ దేనికి సంబంధించి అయి ఉంటుందని ఇటు సీన ప్రముఖులు.. అటు రాజకీయ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kishan Reddy, MAA, Manchu Family, Manchu Vishnu, Mohan Babu