గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో గ్రూపు తగాదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పటికే నిధుల దుర్వినియోగం విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్ వివాదాల్లో ఇరుక్కోంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగం విషయంలో శివాజీ రాజా ప్యానెల్‌కు, నరేష్‌కు ప్యానెల్‌కు మధ్య మాటల యుద్ధం ముదిరిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీళ్లిద్దరి మద్య మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఈ ఎన్నికల్లో మెగాస్టార్ మద్దతు ఎవరికీ అనే విషయమై పెద్ద వివాదమే నడుస్తోంది. ఇక శివాజీ రాజా ప్యానెల్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి అత్యంత సన్నిహితుగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నరేష్ ప్యానెల్‌లోని జీవిత రాజశేఖర్‌లు నరేష్‌తో కలిసి చిరంజీవిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేష్..మెగాస్టార్ చిరంజీవిని కలవడంపై శివాజీ రాజా ప్యానెల్ సభ్యులు వేరే విధంగా స్పందించారు. చిరంజీవి వద్దన్నా వినకుండా నరేష్ ఈ ఎన్నికల్లో నిలబడ్డాడు. ఆయన మద్దతు నరేష్‌కు ఉండదని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
వీటిపై నటి జీవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. మా ఎలక్షన్స్ విషయమై మీడియాలో వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి అని జీవిత వ్యాఖ్యానించింది. ఈ విషయమలో అనవసరంగా చిరంజీవి పేరు రావడం మరింత ఇబ్బందిని కలిగిస్తోందని అన్నారు.
నరేష్ ప్యానెల్‌కు చిరంజీవి మద్దతు లేదని, తన మాటను ధిక్కరించారన్న కారణంగా నరేష్ ప్యానల్‌కు మెగాస్టార్ మద్దతు ఇవ్వడం లేదంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించింది. ఇపుడు ఎలక్షన్స్‌లో ఎవరికి వారు పోటీపడినా..ఆ తర్వాత అందరం కలిసి మా అసోసియేషన్ కోసమే పనిచేస్తామని జీవిత చెప్పారు. ప్రస్తుతం జీవిత రాజశేఖర్..నరేష్ ప్యానెల్‌లో ‘మా’ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Jeevitha, MAA, Naresh, Rajasekhar, Shivaji Raja, Srikanth, Tollywood