హోమ్ /వార్తలు /సినిమా /

కొలువైన ‘మా’ కొత్త కార్యవర్గం.. మొదటి భేటిలోనే సంచలన నిర్ణయాలు..

కొలువైన ‘మా’ కొత్త కార్యవర్గం.. మొదటి భేటిలోనే సంచలన నిర్ణయాలు..

‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో జీవితా రాజశేఖర్

‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో జీవితా రాజశేఖర్

సీనియర్ హీరో నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షకుడిగా ఎన్నికైన తర్వాత ‘మా’ తొలి కార్యవర్గం కాసేపటి క్రితమే హైదరాబాద్‌లో సమావేశం అయింది. ఈ భేటిలో  ‘మా’ కార్యవర్గం కొన్నిసంచలన నిర్ణయాలు తీసుకుంది.

సీనియర్ హీరో నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షకుడిగా ఎన్నికైన తర్వాత ‘మా’ తొలి కార్యవర్గం కాసేపటి క్రితమే హైదరాబాద్‌లో సమావేశం అయింది. ఈ భేటిలో  ‘మా’ కార్యవర్గం కొన్నిసంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆ విషయాలను ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్‌తో పాటు ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్న సభ్యులు తమ సమస్యలను తెలిపేందుకు హెల్ప్ లైన్ నంబర్ 9502030405 ‌ను కాంటాక్ట్ చేయాలని తెలిపారు. ఇక ఫించను దారులకు గతంలో ఇస్తున్న ఫించను అనదంగా వెయ్యి రూపాయాలు కలిపి రూ.6 వేలను వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. ఫించను దారుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెయ్యి రూపాయలు పెంచినట్టు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ‘మా’ సభ్యలకు కూడా వర్తింప చేసేలా అతి త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.


maa.. movie artists association new members naresh,jeevitha raja sekhar taken sensational decisions on the first time meeting,maa elections 2019,maa elections,movie artists association,movie artists association telugu,maa president naresh,maa vice president jeevitha raja sekhar,maa sensational decisions,rajasekhar,jeevitha rajasekhar,actress jeevitha rajasekhar,jeevitha,hero rajasekhar,naresh,maa press meet,rajasekhar speech,maa elections 2019,rajashekar,maa elections,jeevitha about rajasekhar,naresh about rajasekhar,jeevitha rajasekhar speech,jeevitha rajasekahr,jeevitha rajashekar,jeevitha rajasekhar chiranjeevi,jeevitha rajasekhar about chiranjeevi,actor rajasekhar,maa association,hero rajasekhar fun,tollywood,telugu cinema,మా కొత్త వర్గం,మా,మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్,కొలువు తీరిని కొత్త మా కార్యవర్గం,మా కొత్త అధ్యక్షడు నరేశ్,మా కార్యవర్గ సభ్యులు జీవితా రాజశేఖర్,రాజశేఖర్,మా సంచలన నిర్ణయాలు,శివాజీ రాజా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
చిరంజీవితో మా అసోసియేషన్ మెంబర్స్


అంతేకాదు మా అసోసియేషన్‌లో కొత్తగా సభ్యత్వం తీసుకునే వారి కోసం రెండు రకాల పద్ధతులు ప్రవేశ పెట్టనున్నట్లు మా అధ్యక్షుడు నరేశ్‌తో పాటు జీవితా, రాజశేఖర్‌లు వెల్లడించారు. రూ.25 వేలు చెల్లించిన కొత్త సభ్యులకు గోల్డ్ కార్డు అందజేస్తామన్నారు. దీని కాల పరిమితి రెండేళ్లు ఉంటుందని చెప్పారు. ఇకరూ.75 వేలు చెల్లిస్తే..శాశ్వత గుర్తింపు కార్డు పొందుతారని తెలిపారు. అంతేకాదు శాశ్వత గుర్తింపు లభించనంత వరకు ‘మా’ తరుపున వీరికి ఎలాంటి సౌకర్యాలు వర్తింప చేయమన్నారు. ఇక మరో పద్దతిలో రూ.90 వేలు చెల్లించిన వారికి రూ.10 వేల రాయితీతో పాటు శాశ్వత సభ్యత్వ కార్డు ఇస్తామని ఆఫర్ పెట్టారు. ఈ అవకాశం 100రోజులు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో మా సభ్యులందరికీ రూ.2 లక్షల వరకు ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను అందజేసామని గుర్తు చేసారు. ప్రస్తుతం దీనికి మరో  లక్ష పెంచి రూ.3 బీమాను అందజేయనున్నట్టు మా కార్యవర్గంలో ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh, Jeevitha, MAA, MAA Elections, Naresh, Rajasekhar, Shivaji Raja

ఉత్తమ కథలు