MAA EXECUTIVE COMMITTEE MACHU VISHNU REJECTS PRAKASH RAJ PANNEL AND NAGABABU RESIGNATIONS SK
MAA: మాలో మరో ట్విస్ట్.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, నాగబాబు రాజీనామాలపై ఈసీ సంచలన నిర్ణయం
'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని.. అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు మంచు విష్ణు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి విమర్శలు అన్నీ తనకు వినిపిస్తున్నాయని చెప్పాడు ఈయన.
MAA Elections 2021: అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున కూడా కొందరు గెలిచారు. కానీ వారంతా రాజీనామా చేశారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections) జరిగి నేటికి 15 రోజులవుతోంది. కానీ ఇప్పటి వార్తలో ఉంటోంది. ఎన్నికల్లో అవకతవకలపై ప్రకాశ్ రాజ్ (Prakash raj) వర్గం, మంచు విష్ణు (Manchuh Vishnu) వర్గంపై మాటల యుద్ధం జరుగుతున్న వేళ శనివారం ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలతో పాటు నాగబాబు (Nagababu) రాజీనామాను కూడా తిరస్కరించింది. శనివారం మా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. భేటీలో సభ్యుల రాజీనామాలతోపాటు మేనిఫెస్టోలో ప్రకటించిన 14 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు, నాగబాబు రాజీనామాను ఈసీ తిరస్కరించింది. రాజీనామాలు విరమించుకుని పదవుల్లో కొనసాగాలని విజ్ఞప్తి చేస్తూ వారికి లేఖలు రాయాలని తీర్మానించారు. ఇక మా సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం పలు కార్పొరేట్ హాస్పిటల్‌తో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు మా కార్యవర్గం తెలిపింది.
కాగా, అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున కూడా కొందరు గెలిచారు. కానీ వారంతా రాజీనామా చేశారు. కొత్త కార్యవర్గం ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకోవాలనే ఉద్దేశంతోనే తాము రాజీనామాచేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మోహన్ బాబును టార్గెట్ చేసుకొని ప్రకాశ్ రాజ్ వర్గం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల రోజు తమ టీమ్ మెంబర్స్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ రోజు జరిగిన పరిణామాలను తలచుకొని బెనర్జీ, తనీష్ కంటతడిపెట్టారు.
ఇక ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ వర్గ తీవ్రంగా విమర్శిస్తోంది. బ్యాలెట్ పత్రాలు ఇంటికి తీసుకెళ్లారని, రాత్రి గెలిచిన వాళ్లు ఉదయానికి ఎలా ఓడిపోతున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ రోజు పోలింగ్ కేంద్రంలో జరిగిన రచ్చ గురించి ప్రజలందరికీ తెలియాలని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల అధికారులను ప్రకాశ్ రాజ్ కోరారు. అంతేకాదు మా ఎన్నికల్లో బయటి వ్యక్తులు పాల్గొన్నారని ఆరోపిస్తూ ఫొటోలను కూడా విడుదల చేశారు ప్రకాశ్ రాజ్. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రౌడీ షీటర్ నూకల సాంబ శివరావు (Nookala Samba shiva rao) పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఓటర్లను బెదిరించారని ఆరోపించారు. మంచు విష్ణు (Manchu Vishnu)కు అనుకూలంగా పోలింగ్‌ను ప్రభావితం చేశారని విమర్శించారు. మా సభ్యుడి కాని బయటి వ్యక్తిని లోపలికి ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. సాంబ శివరావు వైసీపీ కార్యకర్తగా ఉన్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్నారు.
ఫొటోల ఆధారంగా 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఇప్పటిక ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన విష్ణుపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రోజున అసలేం జరిగిందో అందరికీ తెలియాలని, సీసీ ఫుటేజీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 'మా' ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయటపెడతానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.