Home /News /movies /

MAA ELECTIONS UPDATE PRAKASH RAJ MANCHU MOHAN BABU AND MANCHU VISHNU MEETING NGS

MAA Elections: నిన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నారు.. నేడు మారిన చిత్రం.. మోహన్ బాబును చూసి ప్రకాష్ రాజ్ ఏం చేశారంటే..?

కలిసిపోయిన ప్రకాష్ రాజ్- మోహన్ బాబు, మంచు విష్ణు

కలిసిపోయిన ప్రకాష్ రాజ్- మోహన్ బాబు, మంచు విష్ణు

Manchu Vs Prakash raj: తెలుగు రాష్ట్రాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.. సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి మా ఎన్నికల్లో సీన్లు.. నిన్నటి వరకు వార్ అంతా ప్రకాష్ రాజ్ Vs మంచు ఫ్యామిలీ అన్నట్టు సాగింది. కానీ ఈ రోజు ఎదురు పడితే.. ఏం చేశారో చూడండి..

ఇంకా చదవండి ...
  MAA Elections Update: గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికల్లో (Maa Electionsl) మాటల తూటాలు పేలాయి.. సాధారణ ఎన్నికల్లోనూ సీన్లను తలపించాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలే కాదు.. ఫిర్యాదుల వరకు వ్యవహారం వెళ్లింది. అంతేకాదు ప్రలోభాలపైనా భారీగా ఆరోపణలు వచ్చాయి. పోటీలో ఉన్న మంచు విష్ణు వర్గం (Manchu Vishnu Panel).. ప్రకాష్ రాజ్ వర్గం (Prakash Raj Panel).. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వెంత అంట నువ్వెంత అనుకునే దాకా వెళ్లారు.. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి.. ఇక ఆ సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం ముగిసింది. ఓటింగ్ కూడా చాలా ఉత్కంఠంగా కొనసాగుతోంది.. ఓటు వేసేందుకు దూరంగా ఉంటారని భావించినా.. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు. ఇప్టటికే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓట్ల విషయం ఎలా ఉన్నా.. పోలింగ్ బూత్ దగ్గర కొన్ని సిత్రాలు అవాక్కు అయ్యే లా చేస్తున్నాయి. 'మా' ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఇన్నాళ్లు తిట్టుకున్న మంచు విష్ణు ప్రకాష్ రాజ్ లు ఒక్కటయ్యారు. రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు వాగ్ధానాలు మాటల యుద్ధం చేసుకున్న ఈ ఇద్దరూ ఒకే ఒక్క హగ్ తో అన్నింటికి పుల్ స్టాప్ పెట్టేశారు.

  సాధారణ రాజకీయాలను తలదన్నే రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Move artist association) అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికలు టాలీవుడ్ ( Tollywood) సినీ ఇండస్ట్రీని రెండు వర్గాలు చీల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ ఎన్నికల ఫలితం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య జనాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ప్రారంభమైన 'మా' ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

  ఇదీ చదవండి: బద్వేల్ ఎన్నికలో వార్ వన్ సైడేనా..? జాతీయ పార్టీల పరిస్థితి ఏంటి

  పాదభివందనం..
  నిన్నటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్యానెల్స్ మా ఎన్నికల వేళ కలిసిపోయారు. పోలింగ్ ప్రారంభానికి ముందుగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా మోహన్ బాబు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ ఎదురుపడిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. మోహన్ బాబు సమక్షంలో ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. ప్రకాష్ రాజ్ వెంటనే మోహన్ బాబుకు పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా.. ప్రకాష్ రాజ్ ను వారించిన మోహన్ బాబు భుజం తట్టి ఆశీర్వదించారు. ఇక మాటల మంటలు రేపిన మాజీ అధ్యక్షుడు నరేశ్ సైతం అక్కడే పక్కనే ఉండడం విశేషం.

  https://twitter.com/hashtag/ManchuVishnu?src=hash&ref_src=twsrc%5Etfw">#ManchuVishnu , #MohanBabu and #PrakashRaj greet each other at #MAAElections2021 pic.twitter.com/Cx8i2ASL59

  — OverSeasRights.Com (@Overseasrights)

  టరెండు ప్యానెళ్ల నుంచి పోటీ చేస్తున్న సభ్యులు సైతం 'పోలింగ్' సాధ్యమైనంత ఎక్కువగా జరిగేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తసున్నారు. గతం కంటే ఈసారి 'మా' ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుందని అంచనావేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంట్ల వరకు ఈ పోలింగ్ సాగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల కు తుది ఫలితం వెలువడే చాన్స్ ఉంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Actor prakash raj, MAA Association, MAA Elections, Malladi Vishnu, Manchu mohan babu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు