Maa Elections | దాదాపు 100 కోట్ల ఓటర్లు పాల్గొనే సార్వత్రిక ఎన్నికల్లో ఇన్ని రాజకీయలు ఉంటాయో ఉండవో కానీ.. మా ఎలక్షన్స్ అంత కంటే ఎక్కువ రాజకీయాలున్నాయి. ఇక్కడ జరగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పైకి అంతా సినిమా ఫ్యామిలీ అంటూ చెప్పుకుంటున్న లోపలి మాత్రం ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయనే విషయం గత రెండు పర్యాయాలుగా జరుగుతున్న మా ఎన్నికలను చూస్తుంటే తెలుస్తోంది. ‘మా’ ఎన్నికల్లో పట్టుమని 900 మంది సభ్యులున్నారు. ఇంత దానికే అంత రచ్చ అవసరమా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక మీడియా అటెన్షన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎపుడు ఏమి జరగుతుందా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా అనేది ఎదురు చూస్తు ఉన్నారు. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఆర్ధికంగా ఒడిదుడుగులు ఎదుర్కొంటున్న పేద కళాకారులను ఆదుకోవడమే. మంచి కంటే ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడమే ఎక్కువ ఉంటోంది. తాజాగా సీనియర్ టాలీవుడ్ హీరో ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై తొలిసారి నోరు విప్పారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ బుధవారం అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈయన ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వైద్యుల గొప్పదనాన్ని వేనొళ్ల పొగిడారు. దాంతో పాటు ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు. ‘మా’ ఎన్నికల్లో స్వతహాగా కన్నడీగుడైన ప్రకాష్ రాజ్ లోకల్ ఇష్యూపై స్పందించారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకల్ అనే తేల్చి చెప్పారు. కాబట్టి ఇండస్ట్రీలో అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరారు. ఎంతో మంది కళాకారులకు అన్నం పెట్టే ఈ ఇండస్ట్రీలో లోకల్, నాన్ లోకల్ అనే ప్రస్తావన రావడం అర్ధరహితమన్నారు. ఇక డాక్టర్లు, రైతులు నాన్ లోకల్ అనుకుంటే.. ప్రజలకు చికిత్స, ఆహారం దొరకదన్నారు. ఈ వ్యాఖ్యలతో పరోక్షంగా ప్రకాష్ రాజ్‌కు తన మద్ధతు ప్రకటించారు.
ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా ఐదుగురు సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమతో పాటు తెలంగాణ వాదంతో జీవీఎల్ నరసింహారావు ’మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఫైనల్‌గా ఎవరు ఈ ఎన్నికల్లో విజేతగా నిలుస్తారనేది కాలమే నిర్ణయిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GVL Narasimha Rao, MAA Elections, Manchu Vishnu, Prakash Raj, Suman, Tollywood