MAA Elections : ప్రకాష్ రాజ్‌ ఏ రోజు షూటింగ్‌కు టైమ్‌కు రాలేదు.. కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు..

ప్రకాష్ రాజ్ పై కోట సంచలన ఆరోపణలు (Twitter/Photo)

Maa Elections - Kota Srinivasa Rao - Prakash Raj - Manchu Vishnu :  ‘మా’ (Movie Artist Association) ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు .. మా అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై సంచలన ఆరోపణలు చేసారు.

 • Share this:
  Maa Elections - Kota Srinivasa Rao - Prakash Raj - Manchu Vishnu :  ‘మా’ (Movie Artist Association) ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ ఫ్యానెల్, మంచు ప్యానెల్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ సారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నిక  కాబోతున్నారనే విషయంలో  అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఎంతలా అంటే పట్టుమని 1000 మంది కూడా లేని ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి.  ఒకవైపు ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా మెగా బ్రదర్ రంగంలోకి ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడే సత్తా ఉంది. మంచు విష్ణుకు ఏముంది .. అసలు విష్ణుకు తెలుగు సరిగా రాదు.

  ఒకవేళ తెలుగు భాష పోటీ పెడితే.. మంచు విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు అంటూ నాగబాబు కామెంట్స్ చేసారు. మరోవైపు మంచు విష్ణు .. గతంలో ప్రకాష్ రాజ్‌ను నాగబాబు కు సంస్కారి అన్న మాటలను ప్రస్తావించారు. అంతేకాదు అప్పట్లో ఆయన సొంత సినిమా ‘స్టాలిన్‌’ ప్రకాష్ రాజ్‌ను బ్యాన్ చేయాలని చూసిన సంగతిని ప్రస్తావిస్తున్నారు.

  NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

  ఆ సంగతి పక్కన పెడితే.. టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాస రావు... ప్రకాష్ రాజ్ పై సంచలన ఆరోపణలు చేశారు. నేను ప్రకాష్ రాజ్ గురించి నేనెం మాట్లాడను. నేను నేషనల్ లెవల్ ఆర్టిస్టును.. నాకు ఇన్ని నంది అవార్డులు వచ్చాయి అంటూ నేను ఎప్పుడు చెప్పుకోలేదన్నారు. మూడే ముక్కలు మాట్లాడుతాను. నేను ప్రకాష్ రాజ్‌తో 15కు పైగా సినిమాలు చేశాను. కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రకాష్ రాజ్.. షూటింగ్‌కు టైమ్‌కు వచ్చిన దాఖలాలు లేవు. మనం కొంచెం ఆలోచించుకోవాలన్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో మంచు విష్ణు బాబుకు ఓటేసి గెలిపించడని కోట శ్రీనివాస రావు కోరారు. మొత్తంగా ప్రకాష్ రాజ్ పై సీనియర్ నటుడు కోట చేసిన ఆరోపణలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి.

  Maa Elections - Prakash Raj : మా అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై సీనియర్ సభ్యుల అసహనం..

  మరోవైపు మంచు విష్ణు.. సీనియర్ హీరోలైన కృష్ణతో పాటు కృష్ణంరాజు, బాలకృష్ణను కలిసి సపోర్ట్ చేయమని చెప్పిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ సీనియర్ హీరోల సపోర్ట్ ఉందని మంచు విష్ణు చెప్పారు. ఒక రకంగా మహేష్ బాబు, ప్రభాస్ సపోర్ట్ తనకే ఉందని చెప్పుకొచ్చారు.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారని తెలిపారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు. వీటితో పాటు అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మా ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: