MAA Elections - Rajeev Kanakala : ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో చిరంజీవి కాకుండా ఆ హీరో ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే అధ్యక్షలు.. రాజీవ్ కనకాల సంచలన వ్యాఖ్యలు..

రాజీవ్ కనకాల (Rajeev Kanakala)

MAA Elections - Rajeev Kanakala : ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో చిరంజీవి కాకుండా ఆ హీరో ఎవరికి సపోర్ట్ చేస్తే.. వాళ్లే అధ్యక్షలు అంటూ రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ ఛానె‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సంచలన వ్యాఖ్యలు చేసారు. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    MAA Elections - Rajeev Kanakala : ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో చిరంజీవి కాకుండా ఆ హీరో ఎవరికి సపోర్ట్ చేస్తే.. వాళ్లే అధ్యక్షలు అంటూ రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ ఛానె‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సంచలన వ్యాఖ్యలు చేసారు. వివరాల్లోకి వెళితే.. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.  దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. మా ఎన్నికల పోటీలో ఉన్న ఇరు ప్యానల్ వర్గాలు ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

    ఎంతలా అంటే పట్టుమని 1000 మంది కూడా లేని ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి. తాజాగా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌ ఒకిరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’లో కోశాధికారిగా పనిచేసిన నటుడు రాజీవ్ కనకాల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల్లోె మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్‌తో ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు.

    Nagarjuna - RamyaKrishna: బంగార్రాజు సహా నాగార్జున, రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..

    మరోవైపు మంచు విష్ణు.. సీనియర్ హీరోలైన కృష్ణతో పాటు కృష్ణంరాజును కలిసి సపోర్ట్ చేయమని చెప్పిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ సీనియర్ హీరోల సపోర్ట్ ఉందని మంచు విష్ణు చెప్పారు. ఒక రకంగా మహేష్ బాబు, ప్రభాస్ సపోర్ట్ తనకే ఉందని చెప్పుకొచ్చారు.

    Maa Elections - Prakash Raj : మా అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై సీనియర్ సభ్యుల అసహనం..

    ఆ తర్వాత మంచు విష్ణు తనకు సపోర్ట్ చేయమంటూ  టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణకు కలిసారు. ఈ సందర్భంగా కుమ్మాద్దాం అంటూ బాలయ్య తనకు సపోర్ట్ చేసిన సంగతిని మంచు విష్ణు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో బాలకృష్ణ ఎవరికి సపోర్ట్ చేస్తారో.. వాళ్లే అధ్యక్షులుగా గెలుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..



    మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారని తెలిపారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు. వీటితో పాటు అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మా ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: