హోమ్ /వార్తలు /సినిమా /

MAA Elections - Raghavendra Rao : మా ఎన్నికలు జరిగిన తీరుపై రాఘవేంద్రరావు సంచలన కామెంట్స్..

MAA Elections - Raghavendra Rao : మా ఎన్నికలు జరిగిన తీరుపై రాఘవేంద్రరావు సంచలన కామెంట్స్..

కే.రాఘవేంద్రరావు (File/Photo)

కే.రాఘవేంద్రరావు (File/Photo)

MAA Elections - Raghavendra Rao : రీసెంట్‌గా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA Movie Artists Association) ఎన్నికలు పెద్ద కురుక్షేత్రాన్నే తలపించింది. తాజాగా ఈ ఎన్నికలు జరిగిన తీరుపై దర్శకేంద్రుడు స్పందించారు.

MAA Elections - Raghavendra Rao : రీసెంట్‌గా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA Movie Artists Association) ఎన్నికలు పెద్ద కురుక్షేత్రాన్నే తలపించింది. పట్టుమని 900 మంది కూడా ‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్‌ను తలపించాయి. అంతేకాదు ఈ ఎన్నికల్లో చిరంజీవి మెగా కాంపౌండ్ మద్దతుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై గెలిచారు. త్వరలో ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ సారి మా అసోసియేషన్ ఎన్నికల్లో కంటికి కనిపించని యుద్ధం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అన్నట్టు సాగాయి. ఈ సమరంలో మెగా కాంపౌండ్ పై మంచు కాంపౌండ్ విజయం సాధించింది. తాజాగా ‘మా’లో ఎన్నికలపై కే.రాఘవేంద్రరావు  సంచలన కామెంట్స్ చేశారు.

తాజాగా ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీరుపై దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు స్పందించారు. అసలు ‘మా’ ఎన్నికలు ఇలా జరిగి ఉండకూడదన్నారు. ‘మా’ ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద ప్రకంపనలే పుట్టించాయి. ఇవి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది కాదన్నారు. ఇకపై ‘మా’ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు సజావుగా జరిగేలా సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అందుకు తన సహకారం కావాలనుకుంటే ఇస్తానన్నారు.

Balakrishna Remakes: నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. మా అధ్యక్షునిగా ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుండేదన్నారు. ఇక ‘మా’ సభ్యులు ఈ విషయమై అదే ఆలోచిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాజాగా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు .. అందులో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మా తమ్ముడు మోహన్ బాబు తనయుడికి ఆ సత్తా ఉందంటూ పేర్కొన్నారు. గతంలో కొన్ని సార్లు ‘మా’ ఎలక్షన్స్ జరిగినపుడల్లా.. ఏకగ్రీవం కాన్సెప్ట్‌తో జరిగేవి. ఇకపై అలాగే జరగాలని కోరకుంటున్నానన్నారు.

చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విషయానికొస్తే..  తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. ఆయన స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్లో  వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసారు.

Rajinikanth - Annaatthe : రజినీకాంత్ ‘అన్నాత్తే’ మూవీపై మరో క్రేజీ అప్‌డేట్..

దాదాపు 100 పైగా సినిమాలు తీసి ఇపుడు తన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమా చేశారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా రాఘవేంద్రరావు ‘మా’ ఎలక్షన్స్ జరిగిన తీరుపై స్పందించారు.

First published:

Tags: K. Raghavendra Rao, MAA Elections, Manchu Vishnu, Prakash Raj, Tollywood

ఉత్తమ కథలు