Prakash Raj : పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో అంత కలెక్షన్స్ ఉండవు మీ సినిమా బడ్జెట్.. విష్ణు ప్యానెల్ పై విరుచుపడ్డ ప్రకాష్ రాజ్..

మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ (Twitter/Photo)

Prakash Raj : పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో అంత కలెక్షన్స్ ఉండవు మీ సినిమా బడ్జెట్.. విష్ణు ప్యానెల్ పై విరుచుపడ్డారు ’మా’ అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్. 

 • Share this:
  Prakash Raj : పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో అంత కలెక్షన్స్ ఉండవు మీ సినిమా బడ్జెట్.. విష్ణు ప్యానెల్ పై విరుచుపడ్డారు ’మా’ అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికలకు పట్టుమని పదిరోజులు కూడా లేవు. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఎవరికి వారు మా సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే మంచు విష్ణుతో పాటు, ప్రకాష్ రాజ్ నామినేషన్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మంచు విష్ణు సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లి ఆయన మద్ధతు కోరిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ప్రకాష్ రాజ్.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి తన వంతు ప్రచారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ప్యానెల్ పై విరుచుకు పడ్డారు.

  ఇక ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. తాను చెప్పని మాటలను చెప్పానని మీడియా ముఖంగా అబద్ధాలు చెప్పారన్నారు. ఆయన మర్యాద మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. ఇక మంచు విష్ణు నన్ను.. మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా ? సినీ ఇండస్ట్రీ వైపు ఉన్నారా అని ప్రశ్నించడం బాధించిందన్నారు.

  James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..

  పవన్ కళ్యాణ్.. సినిమా ఇండస్ట్రీ వ్యక్తే కదా. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా అన్ని ప్రశ్నించారు. నేను తెలుగువాడిని కాదు. కర్ణాటకలో జన్మించాను. ఏపీ, తెలంగాణలో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాు. అంతమాత్రానా నేను తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నియమం ఉందా అని ప్రశ్నించారు. రెండు సార్లు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాను. 9 నంది అవార్డులు నాకు వచ్చాయి. అవతలి ప్యానెల్‌లో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

  Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

  నా మీద ఏదో ఒకటి మాట్లాడాలని విమర్శలు గుప్పించడం తగదన్నారు. తెలుగు భాష గురించి  మాట్లాడానికి నేను రెడీ. తెలుగు భాష మాట్లాడేవారంత తెలుగు వారు కాదు. చలం, తిలక్, ఆత్రేయ గురించి చర్చ పెడితే వాళ్ల గురించి మాట్లాడే సత్తా తనకుందున్నారు. అంతేకాదు తెలుగు భాషలోని ఛందస్సు, వ్యాకరణం గురించి ఏదైనా నేను మాట్లాడుతా. మంచు విష్ణు ప్యానెల్‌లో నాలా ఇన్ని క్వాలిటీస్ వున్న వ్యక్తి ఉంటే చూపించండి. మా ఎన్నికల్లో గెలిచి తీరుతానన్నారు.

  Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..

  పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా ? ఆయన ప్రసంగాన్ని విశ్లేషించాలి. మొదట నటుడు. ఆ తర్వాత రాజకీయ నాయకుడు. విష్ణు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటపుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా మార్నింగ్ షో కు వచ్చే కలెక్షన్స్ అంత లేవు మీ సినిమా బడ్జెట్. ఎవరి గురించైనా మాట్లాడేటపుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. ఆయన రాజకీయ అజెండా మాకొద్దు. ఇక వ్యక్తిగతంగా సిద్ధాంత పరంగా మా మధ్య విభేదాలున్నాయి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీ రాజకీయాల గురించి నాకు తెలియవు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు ప్రశ్నలను సంధించారు.

  Allu Ramalingaiah - Allu Arjun : తాత అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు మనవళ్లు..

  ఇక మంచు విష్ణు ప్యానెల్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, సీనియర్ హీరో బాలకృష్ణ వంటి హీరోల మద్ధతు ఉందనే ప్రచారం జరుగుతోంది. అటు ప్రకాష్ రాజ్‌కు మెగా హీరోల మద్దతు ఉండనే ఉంది. మరోవైపు సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరు మంచు విష్ణుకు సపోర్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్‌బాబుకు పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: