తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌కు ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన చేశారు. లోకల్, నాన్ లోకల్ అజెండా ఉన్న ఈ అసోషియేషన్ సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నానని తెలిపారు. తాను మా అవతలి నుంచి అవసరమున్నవారికి చేయాల్సిన సాయం చేస్తానని పేర్కోన్నారు. ప్రాంతీయత, జాతీయవాదం నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. తెలుగోడు కాదు కాబట్టి నన్ను ఎన్నుకోలేదని ఆయన తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో నాకంటూ ఓ ఆత్మగౌరవం ఉంటుందని.. ఈ క్రమంలోనే మా సభ్యాత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది ఏవరిపై కోపంతో కాదనీ, లేక భాదతో కానీ చేయట్లేదని తెలిపారు. అతిథిగా వచ్చి అతిథిగా ఉంటానని తెలిపారు. మా (MAA) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్ పోటీ చేసి ఓడిపోయారు. నిన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలుపోందారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు, ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఒకిరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఓ దశలో ఈ ఎన్నికల హడావిడి ఎలా మారిందంటే.. కనీసం వేయ్యి ఓట్లు లేని ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి.
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో
కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో
కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా"
ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను...
సెలవు.
- నాగబాబు, pic.twitter.com/wLqwOKsNtq
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 10, 2021
ఇక ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్‌గా ఓడియపోవడంతో ఆయన ప్యానెల్‌కు మద్దతు తెలిపిన నటుడు, మెగా బ్రదర్ నాగబాబు (Naga babu) కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా (Social media) ద్వారా తెలిపారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ (Twitter) లో ఓ పోస్ట్ పెట్టారు.’ ప్రాంతీయ వాదం , సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్‌లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు. – నాగబాబు’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు.
మా అధ్యక్ష ఎన్నికల్లో ( MAA president elections) మంచు విష్ణు కు 381 ఓట్లు నమోదు కాగా.. ప్రకాష్ రాజ్ 274 ఓట్లు వచ్చాయి. ఈ హోరాహోరీ పోరులో విష్ణు 103 ఓట్ల మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actor prakash raj, MAA Elections