MAA Election - Prakash Raj : ప్యానల్ సభ్యులతో కలిసి మా అధ్యక్షుడుగా ప్రకాష్ రాజ్ నామినేషన్..

ప్రకాష్ రాజ్ (File/Photo)

MAA Election - Prakash Raj : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. తాజాగా మా అధ్యక్ష పోటీలో భాగంగా నామినేషన్ దాఖలు చేశారు.

 • Share this:
  MAA Election - Prakash Raj : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు (Movie Artists Association) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.  అధ్యక్ష బరిలో నిలిచేవాళ్లు ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ’మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు హేమా (Hema), జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar),సీవీఎల్ నరసింహారావు (CVL Narasimha Rao) పోటీలో ఉన్నారు. చివరకు నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) కూడా ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక జీవిత, హేమా ఇద్దరు ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో చేరి పెద్ద షాక్ ఇచ్చారు. వచ్చే నెల 10వ తేదిన ‘మా’ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

  తాజాగా ప్రకాష్ రాజ్ .. తన ప్యానల్ సభ్యులతో కలిసి మా అధ్యక్ష పదవికి  నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మేం ప్రతి విషయంలో ఒక అడుగు ముందున్నాం. ఇవి ఎన్నికలు కావు. పోటీ మాత్రమే అన్నారు. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించేది ఓటర్లే అన్నారు. అక్టోబర్ 3న మా అధ్యక్షుడిగా తన మేనిఫేస్టో ప్రకటిస్తానన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని వేడుకున్నారు.

  Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..


  ’మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ చిరంజీవి అండదండలతో బరిలో దిగబోతున్నారనేది బహిరంగ రహస్యం. ఈ సందర్భంగా చిరుతో ఆయన పలు సందర్భాల్లో భేటి అయ్యారు.  ఈయనకు నాగబాబు బహిరంగంగా మధ్దతు కూడా ప్రకటించారు. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ప్రకాష్ రాజ్ పలు సందర్భాల్లో తనను విమర్శలు చేసినా.. నటుడిగా మేమంతా ఒకటేనన్న సంగతి తెలిసిందే కదా.

  Rajamouli@20 Years: దర్శకుడిగా 20 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి.. ఆకాశమే హద్దుగా జక్కన్న సినీ ప్రయాణం..


  మరోవైపు మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అందరు తనకే సపోర్ట్ చేయడమే కాకుండా.. తనకే ఓటు వేస్తారంటూ చెప్పుకొచ్చారు. మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్‌ను ఇదివరకే ప్రకటించారు.

  Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

  ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ గా మాదాల రవి, పృధ్విరాజ్, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీస్ గా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, పి.శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన,వడ్లపట్ల పేర్లను ప్రకటించారు.మరోవైపు తెలంగాణ వాదంతో సీవీఎల్ నరసింహారావు మా ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: