Home /News /movies /

MAA ELECTIONS PRAKASH RAJ KARATE KALYANI SENSATIONAL COMMENTS ON PRAKASH RAJ DUE TO HIS NON LOCAL TO CONTEST MAA ELECTIONS TA

Prakash Raj - Karate Kalyani: ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు.. నాన్ లోకల్ అంటూ..

ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు (File/Photo)

ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు (File/Photo)

Prakash Raj - Karate Kalyani: త్వరలో జరగబోయే  ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నట్టు  ప్రకాష్ రాజ్  ప్రకటించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇంకా చదవండి ...
    Prakash Raj - Karate Kalyani: త్వరలో జరగబోయే  ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నట్టు  ప్రకాష్ రాజ్  ప్రకటించడంపై సర్వత్రా
    ఆసక్తి నెలకొంది. చిరంజీవి అండదండలతోనే ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీలో దిగారంటూ ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత మంచు విష్ణు కూడా మా అధ్యక్షుడి పోటీ దిగబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వరుసగా జీవితా రాజశేఖర్, నటి హేమ కూడా మా అధ్యక్ష రేసులో పోటీ పడబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సారి మా అధ్యక్ష ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ తాజాగా ప్రముఖ నటి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మా అద్యక్ష ఎన్నికలు మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా  కన్నడీగుడైన ప్రకాష్ రాజ్.. తెలుగు వాళ్లకు సంబంధించిన మా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అనర్హుడు అంటూ కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

    మా అధ్యక్షుడిగా తెలుగు వాడే ఉండాలి. ఆయనకు మన విషయాలు  ఏం తెలుసు. చాలా మంది ఈ విషయమై బయట పడటం లేదంటూ కరాటే కళ్యాణి కాస్త ఘాటుగానే  వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రకాష్ రాజ్ లొకేషన్‌లో సహనటులతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడరంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆయన మాట్లాడిన అవతలి వాళ్లను ఎగతాళి లేదా అవమానించేలా ఆయన మాటలు ఉంటాయని కరాటే కళ్యాణి వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తి  మా అధ్యక్షుడిగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అంటోంది.

    ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు (File/Photo)


    మరోవైపు ప్రకాష్ రాజ్.. మా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్‌కు ఇప్పటికే చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఐతే.. మెగా ఫ్యామిలీ మాత్రం ప్రకాష్ రాజ్‌ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు తమిళనాడు నడిగర్ సంఘం అధ్యక్ష ఎన్నికలపుడు విశాల్ నాన్ లోకల్ పెద్ద రభస జరిగింది. చిరవకు విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి ప్రకాష్ రాజ్ విషయలో కూడా నాన్ లోకల్ పాలిటిక్స్ మొదలయ్యాయి అంటూ ఆయన ప్యానెల్ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా మా అధ్యక్షఎన్నికలు ముగిసి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు తెలుగు ఇండస్ట్రీలోని రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Karate Kalyani, MAA Elections, Manchu Vishnu, Prakash Raj, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు