MAA ELECTIONS PRAKASH RAJ CONDEMNS THE NON LOCAL TAG SR
MAA Elections : అప్పుడు నాన్ లోకల్ కానిది.. ఇప్పుడు ఎలా అవుతా : ప్రకాష్ రాజ్ కౌంటర్
ప్రకాష్ రాజ్ (file/Photo)
MAA Elections : రోజు రోజుకు మా ఎన్నికలు వేడెక్కుతున్నాయి. మా ప్రెసిడెంట్ పోటీలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) వంటి పెద్ద నటులు ప్రవేశించడంతో రాజకీయాలు ఇంకాస్త ముదిరాయి.
రోజు రోజుకు మా ఎన్నికలు వేడెక్కుతున్నాయి. మా ప్రెసిడెంట్ (MAA Elections) పోటీలో ప్రకాష్ రాజ్ వంటి పెద్ద నటులు ప్రవేశించడంతో రాజకీయాలు ఇంకాస్త ముదిరాయి. ఇక అది అలా ఉంటే ఈ రోజు మా ప్రెసిడెంట్‌గా పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్ (Prakash Raj) తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన నాన్-లోకల్ ట్యాగ్ పై స్పందించారు. ఈ సందర్భంగా కాస్తా తీవ్రమైన స్వరంలో మాట్లాడుతూ నాన్ లోకల్ అన్న వారిపై ద్వజమెత్తారు. తాను రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు, తనను ఎవరూ నాన్ లోకల్ అని ప్రశ్నించలేదని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. తాను గత రెండు దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమలో ఉన్నానని, తన ఆధార్‌కు హైదరాబాద్ చిరునామా ఉందని, తన కుమారుడు హైదరాబాద్‌లోని పాఠశాలకు వెళ్తున్నాడని, తాను ఎలా నాన్ లోకల్ అవుతానని ప్రశ్నించారు. కళాకారులందరూ లోకల్ కాదని యూనివర్సల్ అని వ్యాఖ్యానించారు. అకారణ శత్రుత్వం వద్దని చెప్పారు.
Maa Elections : ప్రకాష్ రాజ్ ప్యానల్ Photo : Twitter
మా ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగాల్సిఉంది. ఇక ఈ మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్‌తో పాటు హీరో మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ పోటిలో ఉన్నారు. దీంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్లో జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యూమ్, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు ఉన్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.