Home /News /movies /

MAA ELECTIONS POLLING TILL 2 PM AND RESULTS AT 8 PM HERE ARE THE DETAILS SR

MAA Elections : మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌.. రాత్రి 8 గంటలకు ఫలితాలు...

Maa Elections Photo : Facebook

Maa Elections Photo : Facebook

MAA Elections : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌కు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం పోలింగ్‌ జరుగనున్న క్రమంలో జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. అదే రాత్రి 8 గంటలకు ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

ఇంకా చదవండి ...
    తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. మా ఎన్నికల పోటీలో ఉన్న ఇరు ప్యానల్ వర్గాలు ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎంతలా అంటే జనరల్ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరు పై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

    ఇక అది అలా ఉంటే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌కు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం పోలింగ్‌ జరుగనున్న క్రమంలో జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడి చేయనున్నారు. అదే రాత్రి 8 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు దాదాపు 880 సభ్యులు ఓటు వేయనున్నారు.

    Kondapolam : వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ కొండపొలం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే..

    మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారని తెలిపారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు.

    వీటితో పాటు అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మా ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన బ్యాలెట్ పద్దతిలో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.

    Rashmika Mandanna : మరోసారి అదరగొట్టిన రష్మిక మందన.. లేటెస్ట్ పిక్స్ చూశారా...

    ఈ ఎన్నికలు ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే... కండీషన్స్ ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: MAA Elections, Tollywood news

    తదుపరి వార్తలు