Maa Elections - Naresh Vs Hema : ’మా’ లో ముదురుతున్న వివాదాలు..హేమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మా అధ్యక్షుడు నరేష్.. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఒకప్పుడు గుట్టుగా సాగిపోయే ‘మా’ కార్యకలాపాలు ఇపుడు రచ్చ కెక్కాయి. ఇక్కడ జరగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పైకి అంతా సినిమా కుటుంబం అంటూ చెప్పుకుంటున్న లోపలి మాత్రం ఎవరి రాజకీయ కోణాలు వారికున్నాయనే విషయం గత రెండు పర్యాయాలుగా జరుగుతున్న మా ఎన్నికలను చూస్తుంటే తెలుస్తోంది. ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా ఐదుగురు సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమతో పాటు తెలంగాణ వాదంతో జీవీఎల్ నరసింహారావు ’మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మా అధ్యక్ష బరిలో ఉన్న హేమ మాట్లాడుతూ.. అధ్యక్షుడిగా ఉన్న నరేష్ మా నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా.
హేమా మాట్లాడిన దానికి ’మా’ అధ్యక్షుడు నరేశ్ స్పందించారు. అంతేకాదు హేమా ‘మా’ అధ్యక్ష నియామావళిని ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమెపై ‘మా’ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కమిటీ ఆమె వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్కనారు. కరోనా నేపథ్యంలో ‘మా’ ఎన్నికలను ఎపుడు నిర్వహించాలనే విషయైమై సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాదు పరిస్థితులు అనుకూలంగానే తగిన సమయంలో ‘మా’ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ప్రకాష్ రాజ్.. తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. పోటీ చేసే మిగతా సభ్యులు తమ ప్యానల్‌ను ఇంత వరకు ప్రకటించలేదు. మరోవైపు మంచు విష్ణు సినీ పెద్దలు ఏకగ్రీవంగా ఎవరినీ ఎన్నుకుంటే వారికి తన మద్ధతు ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే కదా.
ఇవి కూడా చదవండి..
HBD Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో టాప్ బెస్ట్ చిత్రాలు ఇవే..
Balakrishna - Mahesh Babu: మహేష్ బాబు కాపీ కొట్టిన బాలకృష్ణ ఈ సినిమాలు గురించి తెలుసా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hema, MAA Elections, Naresh