MAA ELECTIONS NAGABAU SENSATIONAL COMMENTS ON MANCHU VISHNU GOES VIRAL SR
MAA Elections | Naga Babu : తెలుగులో పాస్ మార్కులు రావు.. బుద్దిన్నోడు ఎవడు నీ దగ్గరకు రాడు : నాగబాబు చురకలు...
Nagabau sensational comments on manchu vishnu Photo : Facebook
MAA Elections | Naga Babu : నాగబాబు మంచు విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..మద్రాస్‌లో పుట్టావు.. అక్కడే చదివావు.. మరి కూడా నాన్ లోకల్ అవుతావా.. తెలుగు సరిగా రాదు.. ప్రకాష్ రాజ్‌కు నీకు తెలుగు టెస్ట్ పెడితే పాస్ మార్కులు రావు.. పంచాయితీ పెద్దగా ఉంటే బుద్దోన్నోడు ఎవడు నీ దగ్గరకు రారు.. కింది నుంచి పైకి వచ్చిన ప్రకాష్ రాజ్‌కు ప్రపంచ జ్ఞానం ఉంది.. అంటూ చురకలు అంటించారు నాగబాబు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. మా ఎన్నికల పోటీలో ఉన్న ఇరు ప్యానల్ వర్గాలు ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎంతలా అంటే జనరల్ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరు పై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా నాగబాబు మంచు విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్‌కు ఓటు వెయ్యాలా లేక మంచు విష్ణుకు ఓటు వెయ్యాలా.. ప్రకాష్ రాజ్ కింది నుంచి వచ్చాడు... అనేక భాషాల్లో నటించాడు. నటుల కష్ట నష్టాలు తెలుసు. అంతేకాదు తనది కాని భాషని కూడా తప్పుగా మాట్లాడడు. ఓ దేశ ప్రధానితో పోట్లాడాడు.
ఇక మంచు విష్ణు విషయానికి వస్తే.. మంచు మోహన్ బాబు కొడుకు, ఓ విద్యా సంస్ధను నడుపుతున్నాడు. కాబట్టి మంచు విష్ణుకు ఏమి తెలియదు.. వాళ్ల నాన్న మోహన్ బాబుకు తెలుసు ఇండస్ట్రీ కష్టాలు.. కానీ మోహన్ బాబు పోటీ చేయట్లేదుగా..
ఇక ప్రకాష్ రాజ్ బయటోడు అయితే.. నువ్వు ఎవరు నువ్వు ఎక్కడ పుట్టావు.. మద్రాస్‌లో పుట్టావు.. అక్కడే చదివావు.. మరి కూడా నాన్ లోకల్ అవుతావా.. తెలుగు సరిగా రాదు.. ప్రకాష్ రాజ్‌కు నీకు తెలుగు టెస్ట్ పెడితే పాస్ మార్కులు రావు.. పంచాయితీ పెద్దగా ఉంటే బుద్దోన్నోడు ఎవడు నీ దగ్గరకు రారు.. కింది నుంచి పైకి వచ్చిన ప్రకాష్ రాజ్‌కు ప్రపంచ జ్ఞానం ఉంది.. అంటూ చురకలు అంటించారు నాగబాబు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మరోవైపు నటి హేమ సీనియర్ నటుడు నరేష్‌తో పాటు కరాటే కళ్యాణిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొన్ని యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో తనను దూషించారని హేమ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాదు నరేష్, కరాటే కళ్యాణి ఇద్దరు తనను బెదిరించారని, బ్లాక్ మెయిల్ చేశారని హేమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యూ ట్యూబ్ నుండి తనపై వచ్చిన అవమానకరమైన వీడియోలను తొలిగించాల్సిందిగా పోలీసులను కోరింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి నటి హేమ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ మా ఎలక్షన్స్ అక్టోబర్ 10 న జరగబోతున్నాయి. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారని తెలిపారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు.
వీటితో పాటు అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక మా ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన బ్యాలెట్ పద్దతిలో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.
ఈ ఎన్నికలు ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే... కండీషన్స్ ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.