Maa Elections: మా ఎలక్షన్స్ నేపథ్యంలో మహేష్ బాబు, ఎన్టీఆర్‌ల తీరును ఏకి పారేసిన సీనియర్ నటుడు..

‘మా’ ఎలక్షన్స్ నేపథ్యంలో మహేష్ బాబు, ఎన్టీఆర్ తీరుపై మురళీ మోహన్ తీవ్ర అసహనం

Maa Elections: మా ఎలక్షన్స్ నేపథ్యంలో మహేష్ బాబు, ఎన్టీఆర్‌ల తీరును ఏకి పారేసిన సీనియర్ నటుడు మురళీ మోహన్. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Maa Elections: మా ఎలక్షన్స్ నేపథ్యంలో మహేష్ బాబు, ఎన్టీఆర్‌ల తీరును ఏకి పారేసిన సీనియర్ నటుడు మురళీ మోహన్. వివరాల్లోకి వెళితే..  తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతర్గతంగా జరిగే ఈ ఎన్నికలు గత కొన్నేళ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ జరగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పైకి అంతా సినిమా ఫ్యామిలీ అంటూ చెప్పుకుంటున్న లోపలి మాత్రం ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయనే విషయం గత రెండు పర్యాయాలుగా జరుగుతున్న మా ఎన్నికలను చూస్తుంటే తెలుస్తోంది. ‘మా’ ఎన్నికల్లో పట్టుమని 900 మంది సభ్యులున్నారు. ఇంత దానికే అంత రచ్చ అవసరమా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక మీడియా అటెన్షన్  కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎపుడు ఏమి జరగుతుందా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా అనేది ఎదురు చూస్తు ఉన్నారు. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఆర్ధికంగా ఒడిదుడుగులు ఎదుర్కొంటున్న పేద కళాకారులను ఆదుకోవడమే. మంచి కంటే ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడమే ఎక్కువ ఉంటోంది.

    ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల్లో ఐదుగురు పోటీలో నిలవడంతో ఈ పోటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సీనియర్ టాలీవుడ్ నటుడు మురళీ మోహన్ .. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదంటూ వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ‘మా’ ఎన్నికలు వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇపుడు ఆయన లేని లోటును చిరంజీవి భర్తీ చేయగలరని వ్యాఖ్యానించారు.

    maa elections,maa elections murali mohan comments,maa president elections,maa president prakash raj,maa president manchu vishnu,maa president jeevitha rajasekhar,telugu cinema,ప్రకాశ్ రాజ్ మా ప్రెసిడెంట్,మంచు విష్ణు మా ప్రెసిడెంట్,జీవిత రాజశేఖర్ మా ప్రెసిడెంట్,మా ఎన్నికలపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు
    ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు (‘Twitter/Photo)


    చిరంజీవికి రాజకీయాల్లో కేంద్ర మంత్రి పదవి చేసిన అనుభవం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసారు. మరోవైపు చిరంజీవి కోట్ల రూపాయలతో పేద కళాకారులకు సాయం చేస్తున్నారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఇంకోవైపు బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు వంటి వారు కూడా తమదైన రీతిలో ఇండస్ట్రీ వాళ్లకు సాయం చేస్తున్న విషయాన్ని గుర్తు చేసారు.  ఇక మా అసోసియేషన్‌లో బడా హీరోలు రావడం లేదని వారికి ఆ అవసరం లేదని మురళీ మోహన్ పేర్కొన్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వాళ్లకు ఏదైనా సమస్య వస్తే వాళ్లే పరిష్కరించుకుంటారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న చిన్న వాళ్లు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే పెద్ద హీరోలు ‘మా’ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎలాంటి వివాదాలు ఉండవని పేర్కొన్నారు.

    murali mohan,murali mohan twitter,murali mohan movies,murali mohan assets,murali mohan sobhan babu assets,murali mohan real estate,murali mohan lands,murali mohan assets gone,murali mohan iddaru movie,murali mohan iddaru movie losses,telugu cinema,మురళీ మోహన్,మురళీ మోహన్ ఆస్తులు,మురళీ మోహన్ ఇద్దరు సినిమా నష్టాలు
    మురళీ మోహన్ (Twitter/Photo)


    ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్ష పదవిలో బడా హీరోలు ప్రెసిడెంట్‌గా ఉంటే ఇలాంటి వివాదాలకు తావు ఉండదన్నారు. మరి మురళీ మోహన్ వ్యాఖ్యలను పెద్ద హీరోలు పట్టించుకొని ‘మా’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: